బామ్మ-మార్గదర్శి
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఎప్పటినుంచో ఈ ఆర్టికల్ రాయాలని కోరిక. ఒక్క ఆడది ఇన్ని పనులు సమర్ధవంతంగా చేయగలదా అని అబ్బురంతో నిండిన ఆశ్చర్యం, నన్ను చిన్నప్పటి నుంచీ వెంటాడుతూనే వుంది. ఒకరకంగా నేను ఈ పోస్ట్ లు రాయడానికి కూడా కారణం అదేనేమో. విమెన్ ఎంపవర్మెంట్ మీద అనర్గళంగా మాట్లాడే ఎంతమందికి ఆ పదం యొక్క అసలైన అర్ధం తెలుసు. 'కనీసం ఆడవాళ్ళకైనా ఆ పదం అర్ధం తెలుసా' అని నాకు అనిపిస్తూ ఉంటుంది. స్వేచ్చకీ, స్వాతంత్య్రంకీ ఎంతమందికి తేడా తెలుసు. చాలామంది ఈ రెండు పదాలనీ పర్యాయ పదాలుగా కూడా వాడేస్తూ వుంటారు. స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ, తాము స్వాతంత్య్రంగా ఉన్నామనో లేదా ఉంటున్నామనో అనుకునే ఎందరు వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు, ఒక దశ దాటాక తాము యెంత నష్టపోయామో అని వెనక్కు తిరిగి చూసుకుని బాధ పడటం లేదా. "ముఖ్యంగా స్త్రీలు" అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఈ మొత్తం ఆర్టికల్ వాళ్ళ గురించే కనుక. నష్టం అనేది మాత్రం స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అటువంటి వారికందరికి ఒక మంచి ఉదాహరణ చూపిద్దామని ఒక ఆశ, అంతే. ఈ అంశానికి భానుమతీ రామకృష్ణ కూడా మరొక అద్భుతమైన ఉదాహరణ. కానీ మన కుటుంబంలో నుంచి ఒక సామాన్య మహిళను ఈ విమెన్ ఎంపవర్మెంట్ కి ఉదాహరణగా చూపించటం నా ముఖ్యోద్దేశం.
అలా ఆడవాళ్ళందరూ హాయిగా స్వాతంత్య్రంగా, సాధికారతతో తాము ఎదుగుతూ, తమ వారినీ తమతో పాటు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలిగే శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకోవాలని నా ఆశ. ఆడది తలచుకుంటే ఏమైనా చెయ్యగలదు అనేది నా గట్టి నమ్మకం. ఎంతమంది ఆడవాళ్లు తమ శక్తిసామర్ధ్యాలను ఉబుసు పోక అమ్మలక్కల ముచ్చట్లతో వ్యర్థం చేసుకోవటం లేదు. చూసారా, వాడుకలో కూడా ఈ "అమ్మలక్కల ముచ్చట్లు" అనే మాటే ఉన్నది కానీ, "అన్నలయ్యల ముచ్చట్లు" అనే మాట లేనే లేదు. ఆడది అంటే తల్లి, చెల్లి, అక్క, అత్తా, కూతురూ, కోడలూ, స్నేహితురాలూ ఇవే కాక ఇంకా ఎన్నో. ఎంతమంది స్త్రీలు తమకు అందుబాటులో వున్న పరిమితమయిన సమయాన్ని తమ అభివృద్ధికి, తమ కుటుంబాభివృద్ధికీ వెచ్చిస్తున్నారు. చాలామంది టైం లేదు అంటారు. ఎవరికైనా ఉన్నది రోజుకి 24 గంటలే కదా. ఆ సమయాన్ని ఎవరికి కావలసినట్లు వారు సర్దుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది ఎవరి జీవితమైనా. మనకోసం మనమే నిర్మించుకునేదే మన జీవితం.

ఇంతకీ ఆ పై రెండు పదాలకి నాకు తెలిసిన, నేను చెప్పే అర్ధం ఇదీ. స్వేచ్ఛ, స్వ-ఇచ్ఛ, అంటే, మన మనసుకి ఆ సమయంలో కలిగే ఒక బలీయమైన కోరిక. స్వాతంత్య్రం అంటే, స్వ-తంత్రం, మన స్ట్రాటజీ, మన పధకం. రెండింటిలోనూ ప్లాన్ చేసేదీ, లబ్ది పొందేదీ మనమే, ఒక దాంట్లో ఆలోచన వుంది, వేరొక దాంట్లో కోరిక వుంది. అంతే తేడా. మనం పొందేవన్నీ మంచివే అయి వుండాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ మంచివన్నీ మనకే కావాలనుకోవడమే ఒక్కోసారి పతనానికి, బాధకి దారి తీస్తుంది. మా బామ్మలో నాకు ఎందుకో అటువంటి పరిణతి చెందిన స్వాతంత్య్ర మహిళ కనిపించేది ఎప్పుడూ. ఆవిడ ఎప్పుడూ ఒక పద్యపాదం చెప్పేది, బహుశా ఆవిడతో అనుబంధం ఉన్న అందరికీ ఆ కొటేషన్ కూడా బాగా తెలుసు. "అనువు కాని చోట అధికుల మనరాదు", "కొండ అద్దమందు కొంచెమై ఉండదా". సుమారు 100 సంవత్సరాల క్రితమే ఆవిడకు తెలుసు, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ విజృంభించాలో. పన్నెండు మంది సంతానాన్ని పైకి తీసుకు రావటం మాటలు కాదు. ఎప్పుడు కాలు బైటకు పెట్టాలో, ఎప్పుడు తలుపు వెనుకే ఉండాలో ఆవిడకు స్పష్టంగా తెలుసు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ముందుగా ఒక్క విషయం చెపుతాను. ఇవన్నీ బామ్మ నాతో స్వయంగా చెప్పిన సంగతులు. నా ఊహాపోహలేమీ ఇక్కడ రాయటం లేదు. బహుశా ఈ మాటలే, నాకు జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో చిన్నప్పుడే నేర్పాయేమో. బామ్మ ఒక ఇల్లాలు. ఇంటిని నిర్వహించేదే ఇల్లాలు. తాతగారేమో మరి ఆయన వేదపాఠాలూ, శిష్యులూ. నిత్యాగ్నిహోత్రం, ఆయన పూజా పంచాయతనం వగైరా. పైగా ఎప్పుడు బామ్మ పర్మిషన్ ఇస్తుందా, వీలైతే సన్యాసం తీసేసుకుని ఈ సంసార లంపటం నుంచి బయటపడి హాయిగా జపతపాలు చేసుకుందామా అనే ఓ కోరిక. సేద్యం మనసు పెట్టి చెయ్యటం లేదు. ఫలితంగా సరియైన పంట ఇంటికి రావటం లేదు. ఇంటి నిండా పిల్లలు, ఆ పైన తాతగారి విద్యార్థులు. ఇల్లు నడవటం ఎలా. తాతగారితో దెబ్బలాడినా పని జరగదు. ఆయన తీరు అంతే. ఆయనకు లౌకిక విషయాలు పట్టవు. కానీ పంతం వస్తే ఆయన తీరు వేరే. ఒకసారి ఏదో పెళ్ళిలో పురోహితుడు మంత్రాలు తప్పు చదువుతుంటే, ఈయన తప్పు పట్టారట. దాంతో వాళ్లకు తప్పు అని తెలిసినా పౌరుషం వచ్చి ఇలా అయితే మీ ఇంట్లో కార్యక్రమాలు మీరే చేసుకోండి అని కట్టు కట్టి, ఊళ్లో వైదీకులందరూ నియోగులు ఇంటి శుభాశుభ కార్యక్రమాలకి రావటం మానేశారట. అప్పుడు తాతగారే, ఆ పనులన్నీ చేయటానికి నడుం బిగించి కొన్నాళ్లపాటు ఆ ఊళ్ళో అటువంటి వైదిక కార్యక్రమాలన్నీ నిరాఘాటంగా జరిపించారట. ఆ దెబ్బకి వైదీక పురోహితులంతా దిగివచ్చి రాజీపడి తిరిగి మామూలుగా నియోగులింట్లో కూడా అన్ని కార్యక్రమాలూ జరిపించడానికి ఒప్పుకున్నారట. ఈ విషయం ఆ ఊరి వాళ్ళు ఈ రోజుకీ చెబుతారు. అదీ తాతగారి పంతం, పాండిత్యం.
బామ్మ ఇదంతా ఆలోచించింది. కేవలం మగవాళ్లే బయటకు వెళ్లి ఇంటికి కావాల్సిన వన్నీ సమకూర్చాలని పంతం పట్టి తాను ఇంట్లోనే కూర్చుంటే లాభం లేదని గ్రహించింది. మొదటిసారి కామందు అవతారం ఎత్తి పొలానికి వెళ్ళింది. ఆ రోజుల్లో ఆ వూళ్ళో ఈ పని చేసిన మొదటి బ్రాహ్మణ స్త్రీ ఆవిడ. ఆవిడ రాంగానే కాస్త కూలీలు దడుచుకున్నారు. పని జరిగింది. పంట సరిగ్గా ఇంటికి వచ్చింది. బామ్మ గట్టు మీద నుంచుందంటేనే చాలు, కూలీలు భయపడ్డారు. భయపడని వాళ్ళని తన నోటి దురుసుతనంతో అదుపులోకి తెచ్చింది. లేకపోతే పిల్లలేం తింటారు, ఎలా బతకాలి, ఇదీ ఆవిడ భయం. లోపల యెంత భయపడ్డా, పైకి మాత్రం రాక్షసిలా నుంచుని పని చేయించింది. వియ్యమ్మగారి నోటి ధాటికి అందరూ భయపడటం మొదలైంది.
పిల్లలెవ్వరికీ వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఆ విషయం గమనించాక పిల్లలను వాళ్ల కిష్టమైన ఇంగ్లీష్ చదువులు చదివించాలని నిర్ణయించుకుంది. ఒక్కొక్కళ్ళ చదువుకీ ఒక్కో పెద్ద నగ అమ్మేసింది. తన వంటిమీద ఉన్న బంగారం కాదు, తన నడత, సమర్ధతే తనకు గుర్తింపు అని గ్రహించుకుంది. పెద్దవాడు లాయర్, రెండోవాడు ఇన్ కమ్ టాక్స్ ప్రాక్టీషనర్, మూడోవాడు రాష్ట్రంలోనే తొలి ట్యుటోరియల్ కాలేజ్ అధిపతి, నాలుగోవాడు రాయల్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్, ఐదోవాడు జడ్జి, ఆరోవాడు ప్రిన్సిపాల్, ఏడోవాడు ప్రొఫెసర్, ఎనిమిదోవాడు ఇంజనీర్. ఆడ పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేసింది. పెద్ద అల్లుడు అగ్రికల్చరల్ ఆఫీసర్, రెండో అల్లుడు ఢిల్లీలో ఆఫీసర్, మూడో అల్లుడు ఇంజనీర్, నాలుగో అల్లుడు హెడ్మాస్టర్. తన బంగారం అంతా అయిపోయింది. బాధ లేదు. పిల్లలందరూ చక్కగా పైకొచ్చారు. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడటమే కాక, నలుగురికి దారి చూపించగల సామర్ధ్యం గల వాళ్ళయ్యారు. వాళ్ళ చదువులకు, పెళ్లిళ్లకు తన ట్రంక్ పెట్టెడు బంగారమూ ఖర్చయిపోయినా, తనకు నిలువెత్తు బంగారపు తొడుగు అమరినట్టు భావించింది. బంగారం పోయిందని బామ్మా బాధ పడటం నేనెన్నడూ చూడలేదు.
పొదున్నించీ పొలంలో అందరినీ అదమాయించీ, అరచీ, తిట్టీ, పనిచేయించాక, సాయంకాలం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు కట్టుకుని, వరండాలో కూర్చుని వ్యాస పీఠం ముందు పెట్టుకుని పురాణ పఠనం చేసేది. ఆ సమయానికి చుట్టుపక్కల ఆడవాళ్లెవరయినా వస్తే, వాళ్లకోసం పురాణప్రవచనం చేసేది. తరువాత భోజనాలు, నిద్ర. పొద్దున్నే లేచి, వంటపనీ, పిల్లలపనీ, ఇంటిపనీ చేసుకుని పొలానికి వెళ్ళటం. ఇదీ బామ్మ నిత్య కార్యక్రమం. వాళ్ళ ఆడబడుచు లక్ష్మీనరసమ్మగారు కూడా సాయం చేసేది కనుక, ఇవన్నీ నిరాటంకంగా జరిగేవి. వంట మాత్రం పూర్తిగా బామ్మదే బాధ్యత, ఎందుకంటే, ముందు చెప్పినట్టు తాతయ్య పూజలకు బామ్మ వంట చేస్తేనే తప్ప నైవేద్యానికి పనికిరాదు. ఈ తాపత్రయంలో పడ్డాక ఇక ఇల్లు, పొలం అంతా ఒకటే. ఊళ్ళో బామ్మ అంటే భయం, గౌరవం మొదలయ్యాయి. ఈవిడతో తిన్నగా ఉంటే తప్ప మర్యాద ఉండదు, ఇవ్వదు అనేది అందరికీ స్పష్టంగా అర్ధం అయ్యింది. పైగా ఎవరికయినా ఏ సాయమయినా చేసేది. చిన్న చిన్న వైద్యాలు చేసేది. పంచాంగం చూసి మంచి చెడ్డలు చెప్పేది. ముహూర్తాలు పెట్టేది. బామ్మకి ఈనాటి చదువులూ సర్టిఫికెట్లూ లేవు కానీ, ఆ రోజుల్లోనే అమరం, పంచ కావ్యాలూ చదువుకుంది. వాళ్ళ నాన్నగారు చెప్పించారట. ఎంచక్కా చదవనూ వ్రాయనూ వచ్చు. అమరం అంటే, అమరకోశం, అంటే అమరభాష సంస్కృతానికి నిఘంటువు. అందుకే అంత బాగా పురాణాలు చదివేది. రామాయణంలో వాల్మీకి సీత గురించి ఒక మాట అంటాడు, సీత ఎలా ఉండేదంటే, "వజ్రాదపి కఠోరాణి, మృదూని కుసుమాదపి" అంటాడు. వజ్రము వలే కఠినమైనది, కుసుమము వలే మృదువైనది" సీత అంటాడు వాల్మీకి. ఇది ఎలా సాధ్యం అంటే, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో కఠినంగా ఉండాలో, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో మృదువుగా ఉండాలో తెలిసిన స్త్రీ, సీత. బామ్మ చదివిన రామాయణం కూడా ఆవిడకి పర్సనాలిటీ ట్రైనింగ్ కి ఉపయోగపడిందేమో.
ఆడపిల్లలు అత్తారిళ్లకు వెళ్లిపోయారు. తల్లిలేని పెద్దకొడుకు కూతుళ్ళకు కూడా పురుళ్ళు పోసింది. ఈ పురుళ్ల కోసం గుడివాడా, ఆరుగొలను రెండు ఊళ్ళ మధ్యా బండి కట్టుకుని కొన్నాళ్ళు అటూ ఇటూ తిరిగేది. ఎప్పుడు ఎవరికి అవసరమైనా వెళ్లి తాను చేయగలిగిన సాయం చేసింది. నెమ్మదిగా పొలం కూడా తరిగి పోతోంది. ఇక బయటకు వెళ్లి పని చేయించే శక్తి సన్నగిల్లింది. పెద్ద మగపిల్లలు చదువుకుని వాళ్ళ వ్యాపకాల్లో స్థిరపడ్డారు. చివరి ముగ్గురు మగపిల్లల బాధ్యతా ఇంకా వుంది. ఆ టైం లోనే మా అమ్మానాన్నల పెళ్లి చేసి, బెజవాడకి మకాం మార్చింది. అప్పటికే, నాన్న బెజవాడలో మునిసిపల్ హైస్కూల్లో టీచర్. పొలం ఉన్నా ఎవరూ పని చేయించరు. కౌలుకిస్తే సరిగ్గా డబ్బు ఇస్తారని నమ్మకం లేదు. దాంతో మిగిలిన కాస్త పొలం అమ్మి, ఆ డబ్బుతో బెజవాడ బయల్దేరారు. ఇల్లు తాళం పెట్టి, పక్కనున్న స్థలంలో చుట్టాలబ్బాయి, లక్ష్మీకాంతారావుకి పాక వేసుకోవటానికి అద్దె కిచ్చింది. వాళ్ళు కట్టుకున్న ఇల్లు వదలక తప్పలేదు. అంతకు ముందూ తాతగారికి బాగా జబ్బు చేసి పక్షవాతం వచ్చినప్పుడు కొన్ని నెలలు గుడివాడ వెళ్లి వున్నారు. తాతగారు అక్కడే ఆతుర సన్యాసం తీసుకున్నారు. అక్కడే చనిపోయారు కూడా. అందువల్ల ఇల్లు వదిలి ఉండే అనుభవం ఉంది. చివరి ముగ్గురు మగపిల్లలూ, మా అమ్మ, తానూ ఐదుగురూ బెజవాడలో కాపురం పెట్టారు. అదీ మా ఉమా పెదనాన్న ఇంటికి దగ్గరగా ఉండేలా ఇల్లు చూసుకుని. ఆ తరువాతే సాంబాబాయ్ బెనారస్ లో ఎమ్మెస్సీ చదివాడు, తరువాత బాబాయే మా నాన్నను ప్రోత్సహించి, ఓ రకంగా చెప్పాలంటే, బలవంతపెట్టి బనారస్ లోనే ప్రైవేట్ గా ఎమ్మే చదివించాడు. తరువాత నాన్న ఎమ్మీడీ, బాబాయ్ పీహెచ్డీ కూడా చేసారు. అది వేరే విషయం. శ్రీధర్ బాబాయ్ ని బెజవాడలో ఉంటే అందరూ చిన్న పిల్లాడని గారాబం చేసి చెడగొడుతున్నారని, పెద్దత్తయ్య దగ్గరకి హైదరాబాద్ పంపించింది. పెద్ద మామయ్యగారికి మంచి డిసిప్లినేరియన్ అనే పేరుండేది. ఆయన దగ్గర ఉంటే కాస్త భయభక్తులతో చదువుకుంటాడని పంపించింది. అక్కడితో బామ్మకి పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ, పురుళ్లూ అంటూ ఆ రకమైన బాధ్యతలు తీరిపోయాయి.

పిల్లలనందరినీ క్రమశిక్షణతో పెంచింది. బాగా చదివించి స్థిరపడేలా చూసింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. వాళ్ళ బాధ్యత తెలుసుకున్నారు. బామ్మ డిగ్రీ వరకే చదివించినా, ఆపైన వాళ్లకి కావలసిన పై చదువులూ అవీ వాళ్ళే చూసుకున్నారు. అందుకే పైకొచ్చారు. వాళ్ళే చదువుకోని, చదువురాని మొద్దు పిల్లలైతే మరి బామ్మ ఏం చేయగలిగేది. ఎవ్వరి దగ్గరా చెయ్యి చాచక్కరలేని స్థితి వచ్చింది. కానీ ఆ స్థితికి ఈ కుటుంబం రావటానికి ఆవిడ యెంత కష్టపడిందో, ఏటికి యెంత ఎదురీదిందో ఆవిడకీ, ఆ దేవుడికీ మాత్రమే తెలుసు. ఒక్కోసారి ఎందుకో చెప్పుకోవాలని అనిపించేది కాబోలు, నాతో ఈ మాటలన్నీ చెప్పేది. ఉన్నది కొంచమే అయినా గుప్పిట మూసి బోల్డు అన్నట్టు పనులు నడిపించేది. అందుకే ఆవిడ పెట్టె ఎప్పుడూ తాళాలు వేసి తన చెంగుకే ఆ తాళం చెవులు కట్టేసుకునేది. ఎవరైనా పెట్టె విప్పి చూస్తే తెలుస్తుంది, లోపల ఆట్టే ఏమీ లేదని. ఆ పెట్టె తెరచి చూసిందాకా, అదో బ్రహ్మ పదార్ధం.
కమ్మగా వంటలు చేసేది. ఆ కాస్తే అందరికీ సద్దేది. మంది ఎక్కువైనా ఏనాడూ భయపడలేదు, ఉన్న మజ్జిగే పల్చన చేసి కాలం గడుపుకొచ్చింది. కోడళ్ళు కూడా తన మాట కాదనలేకుండా అదుపులో ఉంచింది. కొడుకులు తన మాట జవదాటకుండా చూసుకుంది. కూతుళ్లను కనిపెట్టుకుని చూసింది. అల్లుళ్లకు ఏనాడూ మర్యాదలకు లోటు లేకుండా చూసింది. బంధువులందరికీ ఇన్నేళ్లయినా బామ్మ మర్యాదలు గుర్తే. నందివాడ వారింట్లో ఆపేక్షలెక్కువ, మర్యాదలెక్కువ అనే పేరు స్థిరపడేలా చేసింది. ఆ సంప్రదాయాలన్నీ తన పిల్లలు కూడా పాటించేలా చూసింది. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. [రామాయణంలో ఒక చిన్న పిడకల వేట. (పిటకముల వేట) అస్తి, ప్రాస్తి ఇద్దరూ జరాసంధుడి కూతుళ్లు. కంసుడి భార్యలు. ఈ ఆస్తిప్రాస్తులు ఉండటం వల్లనే జరాసంధుడు వంటి గొప్ప మగధ చక్రవర్తి అండ కంసుడికి లభించింది. అందుకే ఆస్తి ప్రాస్తులనే పదాలను అండ అనే పదానికి పర్యాయపదాలుగా వాడటం మొదలయ్యింది. రాను రానూ వాడుకలో ఆ జంట పదాలు ఆస్తి పాస్తి అయ్యాయి.] పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. పొలాలూ, ఇళ్లూ ఇవ్వలేదు. ఉన్న ఊళ్ళో ఉండే సౌకర్యం కూడా ఇవ్వలేదు. ఎదగడానికి చదువిచ్చింది, ఎగరటానికి రెక్కలిచ్చింది. ఎక్కడ ఉన్నా అక్కడ స్థిరపడగలిగే సామర్ధ్యాన్నిచ్చింది. అందరి మధ్యా ఉండే ప్రేమా, ఆపేక్షా చెదిరిపోకుండా, ఓ మంచి సంస్కారాన్నిచ్చింది. కనిపించని ఓ అనుబంధాల అల్లికతో అందరినీ బలంగా ఓ కట్ట కట్టింది. ఇదే ఆవిడ తన పిల్లల కిచ్చిన వారసత్వం. మనం పిల్లలకు చదువులు, సంస్కారం, సమర్ధత, ధర్మాధర్మ విచక్షణా నేర్పగలితే చాలు. ఇంకేమీ ఇవ్వక్కర్లా, అని నిరూపించింది.
ఆవిడ ఆరుగొలను 1954 లో వదిలేసింది. మధ్యలో ఏదో అడపా తడపా వెళ్ళటం తప్ప అక్కడ ఉండిపోయింది లేదు. బామ్మ 1972 లో పోయింది. మేము 2017 లో ఆరుగొలను వెళ్తే, అంటే సుమారు ఆవిడ ఊరు వదిలిన 62 ఏళ్ళ తరువాత కూడా, అందరూ వియ్యమ్మ గారి మనవరాలినని చెప్పంగానే వచ్చి మరీ పలకరించారు. 'మీకు మా బామ్మ ఎలా తెలుసండీ, ఆవిడ చాలా పెద్దది కదా' అంటే, 'అయ్యో, ఆవిడ పేరే చాలండీ, ఇప్పటికీ ఆవిడ గురించి అంతా చెప్పుకుంటారు' అన్నారు. ఆవిధంగా పుట్టిన వూళ్ళో చిరస్మరణీయురాలై పోయింది. ఇంట్లోనే కూర్చుంటే, అందరి ఇల్లాళ్ల లాగానే ఆవిడనీ ఊరు మర్చిపోయేదేమో. మా అందరి ఇళ్లల్లోనే కాకుండా మనసుల్లో, బుర్రల్లో కూడా స్థిరంగా నిలిచిపోయింది. ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, "ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటమ్మా చేయలేనిది." అవును, నిజం, ఆవిడ చెయ్యలేని పనీ లేదు. ఆవిడ చేతి భోజనం చేయని బంధువూ లేడు. ఆవిడ చేత తిట్లు తినని మనుషులు కూడా లేరు. అవును, ఒక్కోసారి బతకాలంటే, నోరు కూడా అవసరం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియటం ఆవిడ విజ్ఞత. అదీ బామ్మంటే. వియ్యమ్మగారా, మజాకా. ఎందరికో మార్గదర్శి.
Peddakka it is a wonderful pen portrait of Baamma the super woman of our family. Proud to be her off springs. Hats off to you.
రిప్లయితొలగించండిExcellent narration Vijaya. She is coming across as a great inspiration to your family and your readers certainly fall in love with her.
రిప్లయితొలగించండిఅక్కయ్యా , బామ్మ నిజం గా superwoman ! women empowerment గురించి మనము ఇప్పుడు ఇంత మట్లాదతాము ! బామ్మ ఆ Time లో నే real empowerment అంటే ఎమిటొ చూపించింది!
రిప్లయితొలగించండిOne thing as you said baamma is lucky to have such wonderful sons and daughters! All if them chose righteous paths.. none of them got into any bad habits! The way she brought up kids with values is another great achievement if hers! So proud of her!
andarikee vandanaalu. baamma nijamgaane o gopa inspiration. aaviadanu choosi yentainaa nerchukovachhu.
రిప్లయితొలగించండిI agree with you Vijayalakshmi Vadina.
రిప్లయితొలగించండిAarojuulo aavida antha samardhavanthamga anni manage chesi family ni chakkaga paiki thecchindi.
One should appreciate her capability and assertiveness and practice that in thoughts& actions for making one's own family more loveable and prosperous and also work for benefit of society making a friendly social environment as per one's resources and limitations.
చాలా బాగుంది. అమ్మమ్మ తో నాకు కూడా అనుభవం ఉంది. చిన్నప్పుడు నేను రామానందు శివ ముగ్గురం బెజవాడ లో అమ్మమ్మ దగ్గరుండి చదువు కున్నాము.
రిప్లయితొలగించండి