బామ్మ-మార్గదర్శి-ఓ కొసరు కథనం
భట్టిప్రోలు విజయలక్ష్మి
బామ్మలో ఉన్న మరో గొప్పదనం ఏమిటంటే, ఏం చేసినా, ఇది నా బాధ్యత అనుకుని చేసేది. నేను కనుక ఇది చేసాను ఇలా చేసాను అన్నట్టు ఎప్పుడూ కనపడేది కాదు. ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. నా ధర్మం అన్నట్టే ఉండేది. ఏనాడూ భర్త గురించి కానీ, నిత్యం ఇంట్లోనే ఉండే బాల వితంతువైన ఆడపడుచు గురించి కానీ ఒక్క కంప్లైంట్ కూడా చెప్పలేదు. ఏమి చేసినా తాతగారి మాట కాదని, అతిక్రమించి చెయ్యలేదు. పెళ్ళిలో తాతగారే, "నాతిచరామి, (న అతి చరామి)", అని ప్రమాణం చేసినా, బామ్మ కూడా ఎప్పుడూ తాతగారి విషయంలో ఈ "న అతి చరామి" అనే సూత్రాన్నే పాటించింది. అంటే నిన్ను దాటి, నిన్ను కాదని నేను అతిగా చరించను అని చెప్పటం. పెళ్లి ప్రమాణంలో తాతగారు నోటితో చెప్తే, కార్యరూపంలో బామ్మ చేసి చూపించింది. పెళ్ళిలో వరుడు ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి అని ప్రమాణం చేస్తాడు. అంటే భర్త భార్యకి వాగ్దానం చేస్తున్నాడు, నేను ధర్మ, అర్ధ, కామ సంబంధమయిన అంశాలలో నిన్ను కాదని చరించను, ఏమీ చెయ్యను అని చెప్తున్నాడు. ఈ లిస్ట్ లో నాలుగో పురుషార్ధమయిన మోక్షం లేదు. మోక్షం పొందే విషయంలో మాత్రం ఎవరి దారి వారిదే. మగవాడే ప్రమాణాలు చేసినా, ఆ నియమాలన్నీ తరువాతి రోజుల్లో ఆచారంలో స్త్రీ సంబంధంగా మార్చబడ్డాయి. కానీ దంపతులు ఇద్దరూ అద్వైతం, అబేధం అనుకుంటున్నప్పుడు ప్రమాణం ఎవరు చేసినా ఇద్దరూ కలిసే కదా ఆ మాట నిలబెట్టాలి. బామ్మ ఏం చేసినా చేస్తున్నాను అని చెప్పి చేసేది. చేయనా అని అనుమతులు అడగలేదు. కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, పర్మిషన్లు అడగకూడదు.
తాతగారి మీద ఆవిడకి ఏనాడూ కోపం లేదు. ఆయన చేయగలిగేది ఆయన, నేను చేయగలిగేది నేను చేశాం. ఆయన చెయ్యలేని పనిని చెయ్యమని వేధిస్తే మాత్రం చెయ్యగలుగుతారా, అనేది. బండికి రెండు చక్రాల్లా ఉండాలి మొగుడూ పెళ్ళాం అనేది. పూజల సెక్షన్ తాతగారిదే, బామ్మా ఏనాడూ పెద్దగా పూజలు చెయ్యటం నేను చూడలేదు. కాకపోతే ఆవిడ తెచ్చుకున్న పంచాయతనం పెట్టెలో దేవతా విగ్రహాలకు మాత్రం క్లుప్తంగా పూజ చేసుకునేది. చివరి రోజుల్లో అదీ లేదు. తనకు దేవుడు విధించిన కార్యం శ్రద్ధగా చెయ్యటమే పూజ అనుకున్న కర్మిష్ఠి బామ్మ. మా నాన్న కూడా అంతే, ఆ విషయంలో వాళ్ళ అమ్మ పోలిక. ఎంతసేపూ మానస పూజే కానీ, ఏనాడూ నిలకడగా కూర్చుని పూజ చేయలేదు, ఒక్క వినాయకచవితి నాడు తప్ప. స్వామీజీలకు మాత్రం చాలా సార్లు పాదపూజలూ, బిక్షలూ చేశాడు. అవి అన్నీ వివరంగా మరో పోస్ట్ లో రాస్తాను.
బామ్మకి పిల్లలందరూ విధేయంగానే ఉండేవారు. వీళ్ళు కూడా ఏదో బామ్మ కష్టపడీ, త్యాగాలు చేసీ మమ్మల్ని ఇంత వాళ్ళను చేసింది కనుక మేము ఆవిడను గౌరవించాలీ అన్నట్టు ఏనాడూ లేరు. ఆవిడ తల్లి, ఆవిడను గౌరవించాలి, అంతే అన్న భావనతోనే ఉండేవారు. సవతి కొడుకని కానీ, దత్తు వెళ్లిన కొడుకని కానీ ఆవిడ ఏనాడూ వాళ్లను తేడాగా చూడలేదు. అందరినీ ఒకే లెక్కలో కలిపే చెప్పేది. 'ఢిల్లీకి రాజయినా, తల్లికి కొడుకే', అని అంటూ ఉండేది. 'వాళ్ళు జడ్జీలయితే నాకేంటి, ప్రిన్సిపాల్ అయితే నాకేంటి, నా కొడుకులు అంతే' అనేది. తాను వాళ్ళను పైకి తెచ్చినందుకు వాళ్ళను ఏదో ఉద్ధరించేసానని ఏనాడూ అనలేదు, అనుకోలేదు. పైగా అంతా బుద్ధిమంతులు, చక్కగా కష్టపడి చదువుకుని పైకొచ్చారు అనేది. పిల్లలకు ఏం చేసినా తల్లిగా తన బాధ్యత అనుకుంది కానీ, తన పిల్లలు తనకి ఋణపడిపోవాలనో, ఋణపడ్డారనో ఎప్పుడూ అనలేదు. పైగా ఒక శాస్త్రం చెప్పేది. ఋణానుబంధ రూపేణా, పశుపత్నీ సుతాలయా.... అని చెప్పేది. 'తల్లి తండ్రులు ఎవరికైనా ఋణం ఉంటే వాళ్ళనే పిల్లలుగా కని, వాళ్ళకి ముడ్డీ, ముక్కూ తుడిచి పెంచాలి, అప్పుడు కానీ ఆ ఋణం తీరదు. పిల్లలు తల్లితండ్రులకున్న ఋణాన్నుంచి వాళ్లను విముక్తులను చేస్తారు. ఎన్నాళ్ళు ఋణం ఉంటే, అన్నాళ్ళు మనతో ఉంటారు, ఋణం తీరిపోయాక, మనతో ఉండరు. తల్లి తండ్రులే పిల్లలకు ఋణం కానీ, పిల్లలు తల్లితండ్రులకు ఋణం కాదు' అని కచ్చితంగా చెప్పేది. 'మరి వృద్ధులైన తల్లీ తండ్రికి పిల్లలు సేవ చెయ్యాలి కదా బామ్మా' అని అడిగితే, 'చెయ్యాలి, అది ధర్మం, ఋణం కాదు. దాని వల్ల వాళ్లకి పుణ్యగతులొస్తాయి' అని చెప్పేది ఏమాత్రం తడుముకోకుండా.
బామ్మ అందరికీ గద్దరిదిగానే తెలుసు. ఆవిడ అలా ఉండకపోతే ఆ ఇల్లు ఏమైపోయేదో ఒక్కసారి ఊహించండి. ఆవిడ ఆ రూపానికి భయపడే కదా ఎక్కడి వాళ్ళక్కడ బుద్ధిగా, మర్యాదగా ఉన్నారు. కనుక కొన్నిసార్లు ఆ మాత్రం గయ్యాళి ముసుగు అవసరం. అది వజ్రకవచంలాగా ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ మెతక వాళ్లయితే కొంప కొల్లేరయిపోతుంది. అటువంటి నష్టాన్ని నివారించాలంటే, ఎవరో ఒకరు కాస్త కఠినంగా ఉండటం, లేదా కఠినంగా ఉన్నట్టు నటించడం ఎంతో అవసరం. ఇల్లు నిలబడాలంటే ఎవరో ఒకరు మంచితనం అనే కవచాన్ని త్యాగం చెయ్యక తప్పదు. అందరికీ అన్నీ రావు. అన్నీ చేయలేరు. భర్తలో లోపాలున్నప్పుడు భార్య, భార్యలో లోపాలున్నప్పుడు భర్త, ఆ గ్యాప్ ని పూరిస్తే ఆ దాంపత్యం, ఆ సంసారం ఎప్పుడూ పరిపుష్టంగా ఉంటుంది. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు సప్లిమెంటరీగా ఉండాలి. బామ్మ లైఫ్ నుంచి ఇలా ఎన్ని నేర్చుకోవచ్చో. అందుకే నేను మార్గదర్శి అనే టైటిల్ పెట్టాను. పిల్లలెవ్వరికీ తండ్రి అంటే ఏమాత్రం మర్యాద తగ్గలేదు. ఆయనని ఎప్పుడూ అందరి దృష్టిలో ఒక సాధు మహాత్ముడుగా నిలపగలిగింది.
ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇవి నా మాటలు. పెద్దలెప్పుడూ పిల్లలకు లగేజీ కాదు, బరువూ కాదు. వాళ్ళు మనతో ఉన్నందువల్ల, వాళ్ళేమీ మననో, మనమేదో వాళ్ళనో ఉద్దరించేస్తున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరితో ఉండాలో అనేది నిర్ణయించేది ఋణానుబంధమే. వాళ్ళు మనతోనే ఉంటే మనం ఎన్ని నేర్చుకోవచ్చో. ఇంట్లోనే ఒక కౌన్సిలర్ ఉన్నట్టు, ఇంట్లోనే ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఉన్నట్టు. మరి తగాదాలు రావా, కొట్లాటలు, మనస్తాపాలూ రావా అంటే, వస్తాయి. రానియ్యండి, ఏమిటి నష్టం. మనలో మనకెప్పుడూ తగాదాలు రావా, మాటా మాటా అనుకోమా, మనస్తాపాలు రావా. పెద్దల విషయంలోనూ అంతే, పోట్లాడండి, దెబ్బలాడండి, మంకు చెయ్యండి. మళ్ళీ కలిసిపోండి. కానీ దూరం పెట్టకండి. బామ్మని ముట్టేసుకుంటా, అని నేనూ బ్లాక్ మెయిల్ చేసేదాన్ని. 'లీలా నీ కూతురు చూడు', అని బామ్మ నా గురించి మా అమ్మకి ఫిర్యాదు చెయ్యటం నాకు ఇప్పటికీ గుర్తే. అయినా ఆవిడ నాకు దోస్తే. ఆలోచించండి. నమస్కారం.

కొసమెరుపు అదిరింది!
రిప్లయితొలగించండిEpilogue is excellent and wonderful!
Baamma and tatayya ❤️❤️❤️ 🙏🏼🙏🏼
రిప్లయితొలగించండిమా అమ్మ నాన్న దాంపత్యం కూడా అలాగే ఉండేది.వాల్లెప్పుడు పోట్లాడు కోవటం మాకు తెలియదు.వాళ్ళ కష్టాలు మాకు తెలియనివ్వలేడు. మేమే అర్థం chhesukun వాళ్ళను కష్ట పెట్టలేదు. అల్లుళ్ళు కూడ అంతే.
రిప్లయితొలగించండిబామ్మ పెంపకం కదా. అత్తయ్యలందరూ మంచి పేరు తెచ్చుకున్నారు.
రిప్లయితొలగించండి