ఆరుగొలను ఇల్లు సిద్ధం
భట్టిప్రోలు విజయలక్ష్మి
నాన్న ప్లానింగ్ అంతా పకడ్బందీగా చేసాడు ఎవరికీ, ఏ ఇబ్బందీ రాకుండా. బామ్మ పెద్దదయిపోయింది కనుక, ఓపిక తక్కువ, అందుకని వంట చేసిపెట్టటానికి ఒక వంట మనిషి, బహుశా ఆవిడ పేరు కమలమ్మ అనుకుంటా, పని సాయానికి ఒక పనివాడు, కోటేశ్వరరావు, స్కూల్లో కాంట్రాక్టు పనివాడు. ఈ ఇద్దరూ బామ్మకి సహాయంగా వచ్చే ఏర్పాటు చేశాడు. ఆ పైన అతి ముఖ్యంగా బామ్మకి తోకగా నేను. మా టీంకి బామ్మ కాప్టెన్. నలుగురం కలిసి ఒక మూడు వారాలలో ఇల్లు మొత్తం స్వాములవార్లకి, వారి పీఠానికీ, సిబ్బందికీ ఏ ఇబ్బంది లేకుండా సిద్ధం చేయించటం మా టాస్క్. అప్పటికి బామ్మ ఆరుగొలను ఊరు వెళ్లి చాలా ఏళ్లయ్యింది. దాంతో, ముందు గుడివాడలో దిగి అక్కడ ఉన్న ఇద్దరు కొడుకులనీ, ఇతర బంధువులనీ చూసి అక్కడి నుంచి ఆరుగొలను వెళ్లాలనేది బామ్మ ప్లాన్. సరే, నాన్న మా నలుగురికీ రైల్లో టిక్కెట్లు బుక్ చేసాడు. గుడివాడ రైల్వేస్టేషన్ కు చిన్నన్నయ్య (మా ఉమా పెదనాన్న వాళ్ళ రెండో అబ్బాయి, మురళి) వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. చిన్నన్నయ్య డ్యూటీ ఏమిటంటే, మమ్మల్ని గుడివాడ స్టేషన్ లో దించుకుని, మాతో పాటు గుడివాడలో ఒక రోజు ఉండి, మమ్మల్ని మళ్ళీ ఆరుగొలనులో దింపి మాక్కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్లాలి. చెప్పా గదా, నాన్న ఏర్పాట్లు చేయటంలో ఘనుడు.
గుడివాడలో పెద్ద పెదనాన్న, శర్మ పెదనాన్న వాళ్ళని కలిసి, ఆ తరువాత ఆ పక్కనే ఉన్న విశ్వం పెదనాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి, అందరినీ కలిసి, ఆ సాయంత్రానికి ఆరుగొలను చేరుకున్నాం అందరం. తీరా ఇంట్లో దిగాక చూద్దును కదా, కరంట్ లేని ఇల్లు అది. బామ్మా, చీకటి, మరి కరంట్ లేకపోతే ఎలా, అంటే, ఆవిడ వెంటనే ఇంట్లోకి వెళ్లి లాంతరు తెచ్చి దీపం వెలిగించింది. చెరువులో చేప లాగ, బామ్మ ఆ ఇంట్లో కాలు పెట్టంగానే, ఎంతో ఉత్సాహంగా మారిపోయింది. ఏది ఎక్కడుంటుందో ఆవిడకి అంత గుర్తు. చిన్నపిల్ల లాగా మారిపోయి, చకచకా ఇల్లంతా తిరిగేసి నాకు అన్ని గదులూ, గదుల్లో అన్ని , వస్తువులూ చూపించేసింది. వాటి గురించి బోల్డు వివరాలు చెప్పింది. బామ్మకి తన ఇల్లు చూడంగానే బోల్డంత శక్తి వచ్చేసింది. ఆ పక్కనే పెరట్లో ఉంటున్న లక్ష్మీకాంతారావు గారు వచ్ఛారు. ఈయనకే, మా బామ్మ పది రూపాయల అద్దె కోసం నాతో ఉత్తరాలు రాయించేది. మా బామ్మ ఆయన్ని కాంతాయ్ అని పిలిచేది. ఆయన బామ్మని అత్తయ్యా అని పిలిచేవాడు. ఈ లక్ష్మీకాంతారావుగారి భార్య మా కోసం ఇల్లు కొంచెం శుభ్రం చేయించి పెట్టింది. ఇంతలో మా సత్యనారాయణ తాతయ్య, మా అమ్మా వాళ్ళ నాన్న, కూడా వచ్చేసారు, "చీకట్లో ఏం ఉంటారు, మా ఇంటికి రండి, అక్కడి నుంచే పని చేయిద్దాం" అంటూ. బామ్మ వింటేనా, "నాయిల్లు నాకు కొత్తా సత్యం, ఇన్నాళ్ల కొచ్చాను, ఇక్కడే ఉంటాను" అనేసింది. పాపం మా తాతయ్య వెళ్ళిపోయాడు. అలా మొదలైంది మా మొదటిరోజు ఆరుగొలనులో. ఎప్పటి మా ఆనందరామయ్య తాతగారూ, ఏనాడనంగా ఆయన సన్యాసం తీసుకున్నారూ, ఆ విషయం చంద్రశేఖరేంద్రసరస్వతికి తెలియగానే వారు ఈ ఇంటికి వస్తానని ఎలా అన్నారూ, అంతా తమాషాగా జరిగింది. మా తాతగారు చాలా గొప్ప మహాత్ములు కాబోలు. మహాత్ముల గురించి మహాత్ములకే తెలుస్తుందేమో. ఆయన గొప్పతనం తెలిసే ఈ ఇంటికి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి వస్తానన్నారేమో. ఇటువంటి భావాలేవీ అర్ధం కాని వయసు నాది అప్పుడు. ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ఇదే నిజం అనిపిస్తోంది.
రెండో రోజు నుంచీ మా అసలు పని సీరియస్ గా మొదలైపోయింది. పని వాళ్ళొచ్చేసారు. అందరూ బామ్మకి తెలిసిన వాళ్ళే. బామ్మ వాళ్లందరినీ పేరు పేరునా పలకరించింది. మంచీ చెడూ అడిగింది. అమ్మో, వియ్యమ్మగారు మనల్ని మర్చిపోలేదు అనుకున్నారందరూ. అందరూ పని లోకి దిగి ముందు పిచ్చి చెట్లు అన్నీ కొట్టేశారు. గడ్డీ, గాదం పీకేశారు. ఇంటి ముందూ, వెనుకా, పక్కనా వున్న పెరడంతా క్లీన్ చేశారు. చక్కగా దొడ్డంతా బాగు చేసాక స్వాములవారికి వంటశాల కోసం పెరట్లో పొడవుగా పెద్ద పాక వేశారు. దాంట్లో గాడిపొయ్యి తవ్వారు. దాన్ని రాళ్లతో, పేడతో చక్కగా పొయ్యి రూపం తెచ్చేసారు. ఇంటి వెనక వైపున కూడా పాకలు వేశారు. బావిలో పూడిక తీశారు. గిలక బాగు చేశారు. మొత్తం పెరడంతా పేడ పెట్టి అలికేశారు. ఇంట్లో అన్ని గదులూ ఖాళీ చేసి ఆ సామాన్లన్నీ పడగ్గదిలో పెట్టారు. దాంతో మా బామ్మ పూజా, పచ్చళ్ళూ కూడా మా పడగ్గది లోకి వచ్చేసాయి. ఇల్లంతా మట్టీ, సిమెంటూ మెత్తి, బొక్కలూ, పగుళ్ళూ పూడ్చేశారు. తరువాత ఇంటికి సున్నాలేశారు. ఇల్లంతా శుభ్రం అయ్యాక మమ్మల్ని పక్క గదిలోకి పంపించి పడగ్గది స్వాములవారి కోసం శుభ్రం చేసి సిద్ధం చేశారు. అమ్మయ్య, ఇంటి పని అయిపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళ కోసం ఇంటి ముందు రోడ్డు పక్కన ఒక పెద్ద పందిరీ, దాంట్లో ఒక పెద్ద వేదికా కట్టారు. మా ఇంటి వసారా లోనే పీఠం పెట్టి అమ్మవారి పూజలు చెయ్యటానికి వీలుగా గట్లు కట్టారు. ఇంటి ముందరే మరో పందిరీ, వేదికా కట్టారు. ఇదేమో స్వాములవారు కూర్చుని తీర్థప్రసాదాలు ఇవ్వటానికి. పెద్ద పందిరేమో ఊళ్ళో వాళ్లంతా కూర్చుని ప్రవచనాలు వినటానికి. ఇక స్వాములవారు, వారి పీఠం, సిబ్బందీ విడిది చేయటానికి ఇల్లూ, ఊరూ సిద్ధం. అంత గొప్ప స్వాములవారు మా ఊరు వస్తున్నారంటేనే అందరికీ గొప్పగా అనిపించింది. చాలా భక్తిగా, శ్రద్ధగా పనులు స్వచ్ఛందంగా చేశారు. ఈ పనంతా ఇంత బాగా చక్కగా జరగటానికి మూడు వారాలు పట్టింది, అది కూడా అందరూ ముచ్చటగా, ఇష్టంగా తలో చెయ్యీ వేశారు కాబట్టి. అమ్మయ్య, మొత్తం పనైపోయింది ఇక మేం వెళ్లిపోవచ్చు.
ఇక ఈ మూడు వారాలూ నా గోడు చెప్తా వినండి. బామ్మకి చాలా ఏళ్ళ తరువాత తన ఇంటికి వచ్చేసరికి మహా బలం వచ్చేసింది. మహోత్సాహంతో వంట పనులూ, ఇంటి పనులూ చేసేసింది. ఆ పనికి మనిషి ఉన్నా సరే. అయిదేళ్ల నాటి ఆవకాయ, నిమ్మకాయ, చింతకాయ అంటూ ఆ పాత జాడీల్లో నుంచి అట్టడుగున ఉన్న ఊరగాయల్ని పట్టుదలగా బైటకు లాగి, నేనెంత బాగా ఊరగాయలు పెట్టేదాన్నో చూడు, అని బలవంతంగా తినిపించింది. పైగా పాత పచ్చళ్ళు పథ్యం అని దబాయించింది. నాకూ, కమలమ్మగారికీ, కోటేశ్వరరావుకీ అదే పచ్చడి. కొత్తగా ఏమైనా తిందాం బామ్మా, అంటే, 'ఠాట్, అంత మంచి పచ్చళ్ళు పారేస్తానా' అని గయ్యిమంది. ఎట్లాగూ అవి చివర్లో పని వాళ్లకి ఇచ్చేసి ఇల్లు క్లీన్ చేయించాం అనుకోండి. పనిలో పనిగా, నేనూ పనివాళ్ళూ కలిసి బామ్మ వంటింట్లో ఎప్పటినుంచో ఉండిపోయిన మిగిలిన సరుకులు కూడా పారేశాం. తెలిసాక బామ్మ గొల్లుమంటూ ఉండేది. అయినా బామ్మ దగ్గర ఆ మాత్రం లిబర్టీ నాకెప్పుడూ ఉండేది లెండి. నేను బామ్మా వాళ్ళ ఇంటికీ , అమ్మమ్మా వాళ్ళ ఇంటికీ మధ్య వారధిగా కూడా ఆ రోజుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండేదాన్ని. అమ్మమ్మా వాళ్ళింటి నుండి బామ్మ పూజకి రోజూ పొద్దున్నే వెళ్లి పూలు తెచ్చిపెట్టేదాన్ని. దానికి వేరే మరో అవసరం కూడా వచ్చి పడింది. బామ్మ ఇంట్లో లెట్రిన్ ఆ రోజుల్లో లేదు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉండేది. బామ్మా, వంట మనిషి కమలమ్మగారూ పొద్దున్నే, అలవాటుగా చెరువు గట్టున ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆ పని ముగించుకునేవారు. నేనేమో పొద్దున్నే లేవలేను. పైగా బామ్మ ఒకప్పుడు తనకి ఇలా తెల్లవారు ఝామున చెరువు గట్టుకి వెళితే, ఓ పెద్ద తాచుపాము ఎలా వచ్చిందో, అప్పుడు బామ్మ కేకలకి అందరూ వచ్చి దాన్ని ఎలా చంపేసారో అంటూ ఓ కథ చెప్పింది. ఇక అంతే, నేను మళ్ళీ పొలాల దగ్గరకి వెళితే ఒట్టు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో లెట్రిన్ ఉంది. రోజూ పొద్దున్నే ఓ కిలోమీటర్ నడిచి వెళ్లి, నా పని ముగించుకుని, వస్తూ వస్తూ బామ్మకి మందారాలూ, సన్నజాజులూ పూజకి తెచ్చి ఇచ్చేదాన్ని. నా అదృష్టం కొద్దీ బామ్మ ఇంట్లో ఓ తడికెల గది బాత్ రూమ్ ఉంది. స్నానాలు మాత్రం అక్కడే చేసేదాన్ని.
ఇక బామ్మ పడగ్గది. దాంట్లో ఇంతెత్తు పందిరి మంచం. బహుశా ఆ రోజుల్లో పందిరి మంచం ఎంత పెద్దదీ, ఎన్ని లతలూ, పువ్వులూ చెక్కారు, ఎంత ఎత్తుగా ఉందీ అన్న దాని మీద ఆ ఇంటి గొప్పతనం లెక్కించేవారేమో నాకు తెలియదు కానీ, అమ్మమ్మా వాళ్ళింట్లో కూడా ఓ పెద్ద పందిరి మంచం ఉంది. దానికీ బోల్డంత కథ ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టటానికి ఆ మంచం కింద దాక్కుంటే, ఎవరికీ కనిపించేది కాదట. ఎటునించీ మా అమ్మమ్మకి చిక్కేది కాదట. అంత పెద్ద మంచం అది. బామ్మా వాళ్ళింట్లో పందిరి మంచమేమో ఇంకా పెద్దదీ, ఎత్తుదీను. దాన్నెక్కడానికో పెద్ద కుర్చీపీటో, నిచ్చెన లాంటిది ఏదో ఉండేది, మంచం లోనే భాగంగా. నేను పొడుగు కదా, ఒక్క గెంతు పెట్టి ఎక్కేసేదాన్ని. పాపం బామ్మ మాత్రం పద్ధతిగా ఆ స్టూల్ ఎక్కే మంచం మీదకు చేరేది. నా కిప్పుడు అర్ధం అవుతోంది, ఆ రోజుల్లో ఆడవాళ్లు మధ్యాన్నం పూట ఓ చిన్న కునుకు తీయటానికి, వంటింటి గడప మీదే తల పెట్టుకుని ఎందుకు పడుకునేవారో. లేకపోతే, ఈ ఎక్కీ, దూకీ, పాకీ, ఈ ప్రొసీజర్ అంతా ప్రతిసారీ ఎవరు పడతారూ అని. మళ్ళీ లేచి దిగి రావాలన్నా అంతే. అంతకన్నా గడప మీద తల పెట్టుకు పడుకోవటం తేలిగ్గదూ. రాత్రిపూట మాత్రం ఈ ప్రొసీజరంతా యథాతథంగా జరగాల్సిందే. ఇప్పుడు ఆ మంచం ఏమైందో. ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళే తీసుకున్నారా, తీసుకుంటే వాళ్ళు దాన్ని అలాగే ఉంచారా, ఏం చేశారో. ఈ సారి మాత్రం ఆరుగొలను వెళ్లే అవకాశం వస్తే ఆ విషయం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, మా వాళ్ళెవ్వరూ లేరు కదా ఇప్పుడు, ఒక్క శ్రీధర్ బాబాయ్ తప్ప. బాబాయికి కూడా ఆ సంగతి ఎంత గుర్తుందో ఏమో. సుమారు 45 ఏళ్ళ కిందట అమెరికా వెళ్ళిపోయాడు మరి.

సుమారు 1966 నాటి నందివాడ కుటుంబం ఫోటో
ఇల్లు రెడీ, ఊరు రెడీ, ఊళ్ళో జనం రెడీ. స్వాములవారి రాక కోసం అంతా సన్నద్ధం అయిపోయింది. మేం నలుగురం పెట్టే బేడా సద్దేసి బయల్దేరాం. ఇక్కడో చిన్న పిట్టకథ. బేడా అంటే ఆ రోజుల్లో 12 పైసలు. పెట్టె సరే, ఈ 12 పైసల బేడాతో ఏం చెయ్యగలం, ఎందుకు పెట్టెతో పాటు బేడా కూడా సద్దాలీ, అని ఎవరికైనా సందేహం వస్తుందేమో అని చెప్తున్నా. ఈ బేడా మన 12 పైసల బేడా కాదు. బెడ్డింగ్ అనబడే పరుపు చుట్ట బేడా ఇది. పూర్వం రైళ్లల్లో వెళ్ళేటప్పుడు ఆ చెక్క బెంచీల మీద కూర్చోలేక, పడుకోలేక మెత్తగా ఉంటుందని ఓ పరుపు చుట్టని బెడ్డింగ్ అనే ఓ హోల్డాల్లో సద్ది తీసుకెళ్ళే వాళ్ళం. గుర్తొస్తోందా, ఆ బెడ్డింగే ఈ బేడా. ఇల్లు తాళం వేసేసి, తాళం చెవులు కాంతాయ్ అనబడే లక్ష్మీకాంతారావు గారికి ఇచ్చేసి, అమ్మమ్మా తాతయ్యలకి టాటా చెప్పేసి, తిరిగి దిగ్విజయంగా తెనాలి వచ్చేసాం. అలా మా ఆరుగొలను జైత్రయాత్ర ముగిసింది. మేం చేసిన పనికి మా నాన్న కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆయన స్వాములవారికి ఈ విషయం చేరవెయ్యడమే మిగిలింది. మళ్ళీ స్వాములవారితో పాటు ఆరుగొలనులో కలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.
గుడివాడలో పెద్ద పెదనాన్న, శర్మ పెదనాన్న వాళ్ళని కలిసి, ఆ తరువాత ఆ పక్కనే ఉన్న విశ్వం పెదనాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి, అందరినీ కలిసి, ఆ సాయంత్రానికి ఆరుగొలను చేరుకున్నాం అందరం. తీరా ఇంట్లో దిగాక చూద్దును కదా, కరంట్ లేని ఇల్లు అది. బామ్మా, చీకటి, మరి కరంట్ లేకపోతే ఎలా, అంటే, ఆవిడ వెంటనే ఇంట్లోకి వెళ్లి లాంతరు తెచ్చి దీపం వెలిగించింది. చెరువులో చేప లాగ, బామ్మ ఆ ఇంట్లో కాలు పెట్టంగానే, ఎంతో ఉత్సాహంగా మారిపోయింది. ఏది ఎక్కడుంటుందో ఆవిడకి అంత గుర్తు. చిన్నపిల్ల లాగా మారిపోయి, చకచకా ఇల్లంతా తిరిగేసి నాకు అన్ని గదులూ, గదుల్లో అన్ని , వస్తువులూ చూపించేసింది. వాటి గురించి బోల్డు వివరాలు చెప్పింది. బామ్మకి తన ఇల్లు చూడంగానే బోల్డంత శక్తి వచ్చేసింది. ఆ పక్కనే పెరట్లో ఉంటున్న లక్ష్మీకాంతారావు గారు వచ్ఛారు. ఈయనకే, మా బామ్మ పది రూపాయల అద్దె కోసం నాతో ఉత్తరాలు రాయించేది. మా బామ్మ ఆయన్ని కాంతాయ్ అని పిలిచేది. ఆయన బామ్మని అత్తయ్యా అని పిలిచేవాడు. ఈ లక్ష్మీకాంతారావుగారి భార్య మా కోసం ఇల్లు కొంచెం శుభ్రం చేయించి పెట్టింది. ఇంతలో మా సత్యనారాయణ తాతయ్య, మా అమ్మా వాళ్ళ నాన్న, కూడా వచ్చేసారు, "చీకట్లో ఏం ఉంటారు, మా ఇంటికి రండి, అక్కడి నుంచే పని చేయిద్దాం" అంటూ. బామ్మ వింటేనా, "నాయిల్లు నాకు కొత్తా సత్యం, ఇన్నాళ్ల కొచ్చాను, ఇక్కడే ఉంటాను" అనేసింది. పాపం మా తాతయ్య వెళ్ళిపోయాడు. అలా మొదలైంది మా మొదటిరోజు ఆరుగొలనులో. ఎప్పటి మా ఆనందరామయ్య తాతగారూ, ఏనాడనంగా ఆయన సన్యాసం తీసుకున్నారూ, ఆ విషయం చంద్రశేఖరేంద్రసరస్వతికి తెలియగానే వారు ఈ ఇంటికి వస్తానని ఎలా అన్నారూ, అంతా తమాషాగా జరిగింది. మా తాతగారు చాలా గొప్ప మహాత్ములు కాబోలు. మహాత్ముల గురించి మహాత్ములకే తెలుస్తుందేమో. ఆయన గొప్పతనం తెలిసే ఈ ఇంటికి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి వస్తానన్నారేమో. ఇటువంటి భావాలేవీ అర్ధం కాని వయసు నాది అప్పుడు. ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ఇదే నిజం అనిపిస్తోంది.

సుమారు 1945 నాటి నందివాడ కుటుంబం ఫోటో
రెండో రోజు నుంచీ మా అసలు పని సీరియస్ గా మొదలైపోయింది. పని వాళ్ళొచ్చేసారు. అందరూ బామ్మకి తెలిసిన వాళ్ళే. బామ్మ వాళ్లందరినీ పేరు పేరునా పలకరించింది. మంచీ చెడూ అడిగింది. అమ్మో, వియ్యమ్మగారు మనల్ని మర్చిపోలేదు అనుకున్నారందరూ. అందరూ పని లోకి దిగి ముందు పిచ్చి చెట్లు అన్నీ కొట్టేశారు. గడ్డీ, గాదం పీకేశారు. ఇంటి ముందూ, వెనుకా, పక్కనా వున్న పెరడంతా క్లీన్ చేశారు. చక్కగా దొడ్డంతా బాగు చేసాక స్వాములవారికి వంటశాల కోసం పెరట్లో పొడవుగా పెద్ద పాక వేశారు. దాంట్లో గాడిపొయ్యి తవ్వారు. దాన్ని రాళ్లతో, పేడతో చక్కగా పొయ్యి రూపం తెచ్చేసారు. ఇంటి వెనక వైపున కూడా పాకలు వేశారు. బావిలో పూడిక తీశారు. గిలక బాగు చేశారు. మొత్తం పెరడంతా పేడ పెట్టి అలికేశారు. ఇంట్లో అన్ని గదులూ ఖాళీ చేసి ఆ సామాన్లన్నీ పడగ్గదిలో పెట్టారు. దాంతో మా బామ్మ పూజా, పచ్చళ్ళూ కూడా మా పడగ్గది లోకి వచ్చేసాయి. ఇల్లంతా మట్టీ, సిమెంటూ మెత్తి, బొక్కలూ, పగుళ్ళూ పూడ్చేశారు. తరువాత ఇంటికి సున్నాలేశారు. ఇల్లంతా శుభ్రం అయ్యాక మమ్మల్ని పక్క గదిలోకి పంపించి పడగ్గది స్వాములవారి కోసం శుభ్రం చేసి సిద్ధం చేశారు. అమ్మయ్య, ఇంటి పని అయిపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళ కోసం ఇంటి ముందు రోడ్డు పక్కన ఒక పెద్ద పందిరీ, దాంట్లో ఒక పెద్ద వేదికా కట్టారు. మా ఇంటి వసారా లోనే పీఠం పెట్టి అమ్మవారి పూజలు చెయ్యటానికి వీలుగా గట్లు కట్టారు. ఇంటి ముందరే మరో పందిరీ, వేదికా కట్టారు. ఇదేమో స్వాములవారు కూర్చుని తీర్థప్రసాదాలు ఇవ్వటానికి. పెద్ద పందిరేమో ఊళ్ళో వాళ్లంతా కూర్చుని ప్రవచనాలు వినటానికి. ఇక స్వాములవారు, వారి పీఠం, సిబ్బందీ విడిది చేయటానికి ఇల్లూ, ఊరూ సిద్ధం. అంత గొప్ప స్వాములవారు మా ఊరు వస్తున్నారంటేనే అందరికీ గొప్పగా అనిపించింది. చాలా భక్తిగా, శ్రద్ధగా పనులు స్వచ్ఛందంగా చేశారు. ఈ పనంతా ఇంత బాగా చక్కగా జరగటానికి మూడు వారాలు పట్టింది, అది కూడా అందరూ ముచ్చటగా, ఇష్టంగా తలో చెయ్యీ వేశారు కాబట్టి. అమ్మయ్య, మొత్తం పనైపోయింది ఇక మేం వెళ్లిపోవచ్చు.
మా తాతయ్యా, బామ్మా
ఇక బామ్మ పడగ్గది. దాంట్లో ఇంతెత్తు పందిరి మంచం. బహుశా ఆ రోజుల్లో పందిరి మంచం ఎంత పెద్దదీ, ఎన్ని లతలూ, పువ్వులూ చెక్కారు, ఎంత ఎత్తుగా ఉందీ అన్న దాని మీద ఆ ఇంటి గొప్పతనం లెక్కించేవారేమో నాకు తెలియదు కానీ, అమ్మమ్మా వాళ్ళింట్లో కూడా ఓ పెద్ద పందిరి మంచం ఉంది. దానికీ బోల్డంత కథ ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టటానికి ఆ మంచం కింద దాక్కుంటే, ఎవరికీ కనిపించేది కాదట. ఎటునించీ మా అమ్మమ్మకి చిక్కేది కాదట. అంత పెద్ద మంచం అది. బామ్మా వాళ్ళింట్లో పందిరి మంచమేమో ఇంకా పెద్దదీ, ఎత్తుదీను. దాన్నెక్కడానికో పెద్ద కుర్చీపీటో, నిచ్చెన లాంటిది ఏదో ఉండేది, మంచం లోనే భాగంగా. నేను పొడుగు కదా, ఒక్క గెంతు పెట్టి ఎక్కేసేదాన్ని. పాపం బామ్మ మాత్రం పద్ధతిగా ఆ స్టూల్ ఎక్కే మంచం మీదకు చేరేది. నా కిప్పుడు అర్ధం అవుతోంది, ఆ రోజుల్లో ఆడవాళ్లు మధ్యాన్నం పూట ఓ చిన్న కునుకు తీయటానికి, వంటింటి గడప మీదే తల పెట్టుకుని ఎందుకు పడుకునేవారో. లేకపోతే, ఈ ఎక్కీ, దూకీ, పాకీ, ఈ ప్రొసీజర్ అంతా ప్రతిసారీ ఎవరు పడతారూ అని. మళ్ళీ లేచి దిగి రావాలన్నా అంతే. అంతకన్నా గడప మీద తల పెట్టుకు పడుకోవటం తేలిగ్గదూ. రాత్రిపూట మాత్రం ఈ ప్రొసీజరంతా యథాతథంగా జరగాల్సిందే. ఇప్పుడు ఆ మంచం ఏమైందో. ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళే తీసుకున్నారా, తీసుకుంటే వాళ్ళు దాన్ని అలాగే ఉంచారా, ఏం చేశారో. ఈ సారి మాత్రం ఆరుగొలను వెళ్లే అవకాశం వస్తే ఆ విషయం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, మా వాళ్ళెవ్వరూ లేరు కదా ఇప్పుడు, ఒక్క శ్రీధర్ బాబాయ్ తప్ప. బాబాయికి కూడా ఆ సంగతి ఎంత గుర్తుందో ఏమో. సుమారు 45 ఏళ్ళ కిందట అమెరికా వెళ్ళిపోయాడు మరి.

సుమారు 1966 నాటి నందివాడ కుటుంబం ఫోటో
ఇల్లు రెడీ, ఊరు రెడీ, ఊళ్ళో జనం రెడీ. స్వాములవారి రాక కోసం అంతా సన్నద్ధం అయిపోయింది. మేం నలుగురం పెట్టే బేడా సద్దేసి బయల్దేరాం. ఇక్కడో చిన్న పిట్టకథ. బేడా అంటే ఆ రోజుల్లో 12 పైసలు. పెట్టె సరే, ఈ 12 పైసల బేడాతో ఏం చెయ్యగలం, ఎందుకు పెట్టెతో పాటు బేడా కూడా సద్దాలీ, అని ఎవరికైనా సందేహం వస్తుందేమో అని చెప్తున్నా. ఈ బేడా మన 12 పైసల బేడా కాదు. బెడ్డింగ్ అనబడే పరుపు చుట్ట బేడా ఇది. పూర్వం రైళ్లల్లో వెళ్ళేటప్పుడు ఆ చెక్క బెంచీల మీద కూర్చోలేక, పడుకోలేక మెత్తగా ఉంటుందని ఓ పరుపు చుట్టని బెడ్డింగ్ అనే ఓ హోల్డాల్లో సద్ది తీసుకెళ్ళే వాళ్ళం. గుర్తొస్తోందా, ఆ బెడ్డింగే ఈ బేడా. ఇల్లు తాళం వేసేసి, తాళం చెవులు కాంతాయ్ అనబడే లక్ష్మీకాంతారావు గారికి ఇచ్చేసి, అమ్మమ్మా తాతయ్యలకి టాటా చెప్పేసి, తిరిగి దిగ్విజయంగా తెనాలి వచ్చేసాం. అలా మా ఆరుగొలను జైత్రయాత్ర ముగిసింది. మేం చేసిన పనికి మా నాన్న కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆయన స్వాములవారికి ఈ విషయం చేరవెయ్యడమే మిగిలింది. మళ్ళీ స్వాములవారితో పాటు ఆరుగొలనులో కలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి