కుర్తాళం, పుష్పగిరి, గాయత్రి పీఠాలతో నాన్న
భట్టిప్రోలు విజయలక్ష్మి
అలాగే మా ఇంట్లో పీఠం తొలిసారిగా పెట్టిన వారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి. అమ్మా, నాన్నా ఆయనకు పాదపూజ చేసి బిక్ష పెట్టినప్పుడు, అదో పండుగలా ఉండేది. స్కూల్ స్కూలంతా తరలి వచ్చేవారు. ఆ రోజు సుమారు ఓ వందమంది పైగా భోజనం చేసేవారు. స్కూల్లో ఉండే బ్రాహ్మణ ఉద్యోగులు వచ్చి భోజనాలు వడ్డించేవారు. వండిన వంటలు సరిపోకపోతే నెమ్మదిగా కూర్చోండి, అనేవారు. అదో సిగ్నల్ అందరికీ, ఏదో వంటకమో, అన్నమో అయిపోయింది, మళ్ళీ వండుతున్నారు, కాస్త నెమ్మదిగా తినండి అది వచ్చేదాకా అని చెప్పటం. ఉన్నట్టుండి, "భోజనకాల సమయే, గోవిందా నామ స్మరణా.." అని ఎవరో ఒకరు గట్టిగా అరచి, గోవిందా, గోవిందా అనేవారు. దాంతో అన్ని గదుల్లో భోజనం చేస్తున్న వారందరూ కూడా గోవిందా గోవిందా అని కేక పెట్టేవారు. మా లాంటి పిల్లలం, ఉడత సాయం లాగా, నెయ్యి, నీళ్లు వడ్డించేవాళ్ళం. ఇల్లంతా ఆ సమయంలో అన్ని గదులూ భోజనశాలలై పోయేవి. స్వాములవారు పూజ చేసి, అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చాక, తన పాదపూజ అయ్యాక, తాను భోజనం చేస్తూ, అందరికీ భోజనం వడ్డించమని సైగ చేసేవారు. అన్నీ అయ్యేసరికి సాయంత్రం అయ్యేది. అప్పటికి స్వాములవారు కాసేపు విశ్రమించి, తిరిగి సాయంకాల ప్రవచనానికి తయారైపోయేవారు. ఎవరిదో కారు వచ్చేది, ఆయన వెళ్ళిపోయేవారు. అక్కడ ప్రవచనం అయిపోయాక, (మళ్ళీ అక్కడ తిరిగి పూజా, తీర్ధాలూ, ప్రసాదాలూ ఉండేవి) ఇంటికి వచ్చి కాసేపు మంచీ చెడూ మాట్లాడి పడుకునేవారు.
తరువాత పెట్టిన పీఠం గాయత్రీ వారిది. ఆయన శ్రీ విద్యా శంకర భారతీ తీర్థ స్వామి. ఆ స్వాములవారితో పాటు రమణమూర్తీ, రామబ్రహ్మం అని ఇద్దరు సహాయకులు కూడా ఎప్పుడూ వచ్చేవారు. వాళ్లిద్దరూ ఎప్పుడూ స్వామీజీనే కనిపెట్టుకుని ఉండేవారు. ఆయనకి ఏం కావలసినా వాళ్ళే చూసుకునే వారు. అందులో రమణమూర్తికి తాను తరువాతి పీఠాధిపతిని అవుతానని కాస్త ఆశగా ఉండేది, అవ్వాలని కోరికగా కూడా ఉండేది. ఆ తరువాత ఆ పీఠం ఏమయ్యిందో, మాకెవ్వరికీ తెలియదు, గుర్తు లేదు. తరువాత ఎవరు పీఠాధిపతి అయ్యారో తెలియదు. ఆ కొత్త స్వామితో కూడా మాకెవరికీ వ్యక్తిగత పరిచయం కూడా లేదు. ఆయనతో పాటే ఆయన పీఠం వ్యక్తులు రమణమూర్తి, రామబ్రహ్మం అనేవాళ్ళు కూడా ఇద్దరు వచ్చేవాళ్ళు. వాళ్ళు స్వామీజీకి కావలసిన సేవలూ, ప్రసాదాలూ అన్నీ చూసుకునేవారు. ఈ రమణమూర్తి, రామబ్రహ్మం మా ఇంట్లోనే తినేవాళ్లు. పీఠం తాలూకు వెండి సామాన్లు అవీ వాళ్ళే తోముకునే వాళ్ళు.
కుర్తాళం పీఠానికి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి తరువాత శ్రీ శివ చిదానంద భారతీ స్వామి అధిపతి అయ్యారు. ఆ తరువాత వచ్చినది శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, మా ఉమా పెదనాన్న చిన్న కోడలు సుశీలాదేవి, చిన్నవదిన అంటాం, ద్వారా మళ్ళీ దగ్గరయ్యారు. ఆవిడ స్వాములవారి శిష్యురాలు. మా శ్రీధర్ బాబాయ్ కూడా అమెరికా నుంచి వచ్చినప్పుడు కుర్తాళం పీఠాధిపతికి పాదపూజ చేసి, బిక్ష పెట్టారు. తదనంతరం నేనూ వారి శిష్య బృందంలో చేరాను. వారు నాకు హనుమత్ మంత్రము, గణేశ మంత్రము ఉపదేశించారు. ఆ రెండు మంత్రాలూ కూడా మననం చేస్తూనే ఉన్నాను. బదరిలో కామధేనువు చెవిలో చెప్పి వదిలేసిన మంత్రాలలో ఈ రెండు మంత్రాలు కూడా ఉన్నాయి. నేను స్వామివారి శిష్యురాలినే కానీ, మా నాన్నలా అంత అనుబంధం ఎందుకనో పెంచుకోలేదు. త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు మాత్రం మాకు అత్యంత ఆత్మీయులుగా ఉండేవారు.
ఒకసారి తెనాలిలోనే శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి పట్టాభిషేక జయంత్యుత్సవం జరిగింది. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి కూడా ఉన్నారు. పుష్పగిరి స్వామివారికి సంపూర్ణంగా రాజాలంకరణ చేసి, కిరీటం, భుజకీర్తులు పెట్టారు. మా అమ్మా, నాన్నా, రాజదండాలు పుచ్చుకుని స్వాములవారికి అటూ ఇటూ నిల్చుని ఫోటో కూడా తీయించుకున్నారు. అలా చాలామంది భక్తులు కూడా చేసారు. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు కూడా వచ్చారు. వారు పుష్పగిరి పీఠాధిపతి సాష్టాంగ నమస్కారం చేసి, కానుకలు అందించారు. నేను తెల్లబోయాను. ఎందుకంటే, కుర్తాళం స్వామి వృద్ధుడు, పుష్పగిరి స్వామి యువకుడు. ఇద్దరూ సన్యాసులే, పీఠాధిపతులే. చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు అలా దణ్ణం పెట్టొచ్చా అని నాకు సందేహం కలిగింది. తరువాత నాన్నను అడిగితే, ఆయన చెప్పారు. కుర్తాళం పీఠం, పుష్పగిరి పీఠానికి ఉప పీఠమట. అందుకని పుష్పగిరి స్వామి గురు స్థానంలోనూ, కుర్తాళం స్వామి శిష్య స్థానంలోనూ ఉన్నారని చెప్పారు. సరే, నా సందేహం తీరిపోయింది, గురువు కెప్పుడూ శిష్యుడే కదా నమస్కరించాలి.
పుష్పగిరి స్వామి సంబల్పూర్ వచ్చినప్పుడు, అక్కడి వారెవరికీ మా నాన్నలోని ఈ కోణం తెలియదు. మొదటిసారి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అక్కడా కార్యక్రమం అంతే, ఇంట్లో పీఠం, పూజలూ, భజనలూ, తీర్ధాలూ, ప్రసాదాలూ. కాలనీ వాళ్లంతా వచ్చేవాళ్ళు. స్కూల్ వాళ్లంతా వచ్చేవాళ్ళు. వాళ్లలో అందరికీ తెలుగు రాదు కదా, అందుకని పుష్పగిరి స్వామి హిందీలోకానీ, సంస్కృతంలో కానీ ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ రోజుల్లో మా చిన్న చెల్లెలు పద్మ హిందూస్తానీ సంగీతం నేర్చుకుంటూ ఉండేది. వాళ్ళ సంగీతం టీచరు హార్మోనియం తెచ్చి తాను వాయిస్తూ, మా పద్మ చేత తాను నేర్పిన భజనలు పాడించి స్వాములవారికి వినిపిస్తూ ఉండేవాడు. మా పద్మది చక్కటి గాత్రం. 'శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం, జై గణేశ జై గణేశ రక్షమాం', 'ఠుమక్ చలత రామచంద్ర' అని కమ్మగా పాడేది. స్వామీజీ మెచ్చి ఆశీర్వదించిన పాట దానిది. హిందూస్తానీ మ్యూజిక్ లో డిప్లొమా కూడా పాసయ్యింది. అంత మంచి గాత్రాన్ని తరువాతి రోజుల్లో పడుకోపెట్టేసింది. ఆ విషయం మా కందరికీ బాధగానే ఉండేది. మా ఇంట్లో పది పదిహేను రోజులున్న తరువాత పుష్పగిరి స్వామివారు సంబల్పూర్ నుంచి ఒరిస్సాలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా పుష్పగిరి పీఠంతో మా సాహచర్యం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది.
ఒక పదేళ్ల కిందట మా వారు ప్రొద్దటూరులో పనిచేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల క్షేత్రాలన్నీ చూడటానికి వెళ్ళాం. అప్పుడు చూశాను పుష్పగిరిని. పీఠానికి కూడా వెళ్ళాం. కానీ స్వాములవారు అప్పుడు హైదరాబాదులో ఉన్నారని చెప్పారు. నది ఒడ్డున ఆలయంలో ఆది శంకరులు ప్రతిష్టించి పూజించిన పెద్ద రెండడుగుల ఎత్తైన శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి నేను నా అదృష్టం కొద్దీ పక్కనే కూర్చుని ఆ ఆలయ పూజారి తల్లి ఖడ్గమాలాస్తోత్రం ధారాళంగా చదువుతుంటే, నిష్టగా కుంకుమార్చన చేసుకున్నాను. నడుం లోతు నీళ్ళల్లో నడిచి నది దాటి, ఒడ్డుకి ఆవలి వైపున ఉన్న, కొండ మీద ఉన్న చెన్నకేశవుడినీ,శివుడినీ దర్శించుకుని తిరిగి వచ్చాం. ఆ ఆలయ విశేషాలు, అక్కడి అపూర్వ శిల్ప సంపద గురించి మరోసారి రాస్తాను. నదుల నడి మధ్యలో వికసించిన పువ్వులా ఉన్న కొండే పుష్పగిరి. అందుకే ఆ పేరు. ఆ నీళ్లలో అయిదు నదుల నీళ్లు కలసి ప్రవహిస్తున్నాయి. ఆ నదులే పెన్నా, పాపాఘ్ని, కుందూ, అర్కావతి,పాలార్. ప్రభుత్వం వాళ్ళు పంటల కోసం నీళ్లు వదిలినప్పుడు, కృష్ణా, తుంగభద్రా కూడా కలుస్తాయట. అక్కడి పూజారులు చెప్పారు. నదిలో నీళ్లలో నడిచి వెళ్లామని చెప్పాను కదా, అది చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎక్కడ గుంత ఏర్పడుతుందో, ఎక్కడ మేట ఏర్పడుతుందో తెలియదు. రెండోసారి వెళ్ళినప్పుడు, నీళ్ళల్లో దిగటానికి భయమేసేంత ప్రవాహం ఉంది. అప్పుడు మా సంశయాన్ని గమనించిన ఒక పురోహితుడు, ఆవలి ఒడ్డు నుంచి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వెంట బెట్టుకుని తీసుకు వెళ్ళాడు. లేకపోతే నీళ్ళల్లో బాట తెలియలేదు. ఒడ్డుకి చేరాక కొంచెం కొండ ఎక్కాలి. వానాకాలంలో పరిస్థితి ఇలా ఉంటే, ఎండాకాలంలో ఇసుకలో కాళ్ళు కాలిపోతాయి. మొత్తానికి అన్ని ఇబ్బందులూ దాటుకుని రెండుసార్లు పుష్పగిరి వెళ్లాం.
ఈ సారి పోస్టులో శృంగేరి పీఠంతో అప్పటి పీఠాధిపతి శ్రీ అభినవ విద్యాతీర్థ మహా స్వామి వారితో మాకున్న అనుబంధం గురించి వ్రాస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.

తరువాత పరిచమైన స్వాములవారు పుష్పగిరి పీఠాధిపతులు, శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు. ఈ స్వామి వారైతే మొత్తం కుటుంబానికి ఎంత దగ్గరైయ్యారో మాటలతో చెప్పలేను. తెనాలిలోనే కాకుండా మేము సంబల్పూర్(ఒరిస్సా) వెళితే అక్కడికీ వచ్చి మా ఇంట్లో పీఠం పెట్టారు. తెనాలికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వసారాలోనే పుష్పగిరి పీఠం పెట్టారు. ఆ వసారా ఏం పుణ్యం చేసుకుందో మరి. ఆ వసారాలోనే ఒకసారి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వచ్చి కాసేపు సత్సంగం చేశారు. అప్పుడు మైలవరపు శ్రీనివాస రావు కూడా వచ్చారు. వారు అప్పుడు తెనాలిలో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్. పుష్పగిరి పీఠాధిపతి వారి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుర్తాళం స్వాములవారి తరహాలోనే ఉండేవి. ఇంట్లో నిత్య పూజ, తీర్ధ, ప్రసాద వితరణ రోజూ ఉండేవి. ఆ తరువాత స్వాములవారు ఎవరింటికి భిక్షకు వెళ్ళాలో చూసుకుని వెళ్లేవారు. రాత్రికి కూడా వాళ్ళే స్వాములవారి అల్పాహారమో, ఫలాహారమో తెచ్చేవారు, లేకపోతే మా అమ్మ ఉండనే ఉంది. సాయంకాలాల్లో రోజూ స్కూల్లో ప్రవచనాలు ఉండేవి. వేలాదిగా జనం వచ్చేవారు. స్వాములవారి చేతి తీర్ధం కోసం వచ్చేవారు. ఆ విధం గా ఈ పీఠాధిపతి కనీసం నాలుగుసార్లయినా మా ఇంటికి వచ్చేవారు.

ఒకసారి తెనాలిలోనే శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి పట్టాభిషేక జయంత్యుత్సవం జరిగింది. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి కూడా ఉన్నారు. పుష్పగిరి స్వామివారికి సంపూర్ణంగా రాజాలంకరణ చేసి, కిరీటం, భుజకీర్తులు పెట్టారు. మా అమ్మా, నాన్నా, రాజదండాలు పుచ్చుకుని స్వాములవారికి అటూ ఇటూ నిల్చుని ఫోటో కూడా తీయించుకున్నారు. అలా చాలామంది భక్తులు కూడా చేసారు. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు కూడా వచ్చారు. వారు పుష్పగిరి పీఠాధిపతి సాష్టాంగ నమస్కారం చేసి, కానుకలు అందించారు. నేను తెల్లబోయాను. ఎందుకంటే, కుర్తాళం స్వామి వృద్ధుడు, పుష్పగిరి స్వామి యువకుడు. ఇద్దరూ సన్యాసులే, పీఠాధిపతులే. చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు అలా దణ్ణం పెట్టొచ్చా అని నాకు సందేహం కలిగింది. తరువాత నాన్నను అడిగితే, ఆయన చెప్పారు. కుర్తాళం పీఠం, పుష్పగిరి పీఠానికి ఉప పీఠమట. అందుకని పుష్పగిరి స్వామి గురు స్థానంలోనూ, కుర్తాళం స్వామి శిష్య స్థానంలోనూ ఉన్నారని చెప్పారు. సరే, నా సందేహం తీరిపోయింది, గురువు కెప్పుడూ శిష్యుడే కదా నమస్కరించాలి.

పుష్పగిరి స్వామి సంబల్పూర్ వచ్చినప్పుడు, అక్కడి వారెవరికీ మా నాన్నలోని ఈ కోణం తెలియదు. మొదటిసారి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అక్కడా కార్యక్రమం అంతే, ఇంట్లో పీఠం, పూజలూ, భజనలూ, తీర్ధాలూ, ప్రసాదాలూ. కాలనీ వాళ్లంతా వచ్చేవాళ్ళు. స్కూల్ వాళ్లంతా వచ్చేవాళ్ళు. వాళ్లలో అందరికీ తెలుగు రాదు కదా, అందుకని పుష్పగిరి స్వామి హిందీలోకానీ, సంస్కృతంలో కానీ ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ రోజుల్లో మా చిన్న చెల్లెలు పద్మ హిందూస్తానీ సంగీతం నేర్చుకుంటూ ఉండేది. వాళ్ళ సంగీతం టీచరు హార్మోనియం తెచ్చి తాను వాయిస్తూ, మా పద్మ చేత తాను నేర్పిన భజనలు పాడించి స్వాములవారికి వినిపిస్తూ ఉండేవాడు. మా పద్మది చక్కటి గాత్రం. 'శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం, జై గణేశ జై గణేశ రక్షమాం', 'ఠుమక్ చలత రామచంద్ర' అని కమ్మగా పాడేది. స్వామీజీ మెచ్చి ఆశీర్వదించిన పాట దానిది. హిందూస్తానీ మ్యూజిక్ లో డిప్లొమా కూడా పాసయ్యింది. అంత మంచి గాత్రాన్ని తరువాతి రోజుల్లో పడుకోపెట్టేసింది. ఆ విషయం మా కందరికీ బాధగానే ఉండేది. మా ఇంట్లో పది పదిహేను రోజులున్న తరువాత పుష్పగిరి స్వామివారు సంబల్పూర్ నుంచి ఒరిస్సాలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా పుష్పగిరి పీఠంతో మా సాహచర్యం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది.

ఒక పదేళ్ల కిందట మా వారు ప్రొద్దటూరులో పనిచేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల క్షేత్రాలన్నీ చూడటానికి వెళ్ళాం. అప్పుడు చూశాను పుష్పగిరిని. పీఠానికి కూడా వెళ్ళాం. కానీ స్వాములవారు అప్పుడు హైదరాబాదులో ఉన్నారని చెప్పారు. నది ఒడ్డున ఆలయంలో ఆది శంకరులు ప్రతిష్టించి పూజించిన పెద్ద రెండడుగుల ఎత్తైన శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి నేను నా అదృష్టం కొద్దీ పక్కనే కూర్చుని ఆ ఆలయ పూజారి తల్లి ఖడ్గమాలాస్తోత్రం ధారాళంగా చదువుతుంటే, నిష్టగా కుంకుమార్చన చేసుకున్నాను. నడుం లోతు నీళ్ళల్లో నడిచి నది దాటి, ఒడ్డుకి ఆవలి వైపున ఉన్న, కొండ మీద ఉన్న చెన్నకేశవుడినీ,శివుడినీ దర్శించుకుని తిరిగి వచ్చాం. ఆ ఆలయ విశేషాలు, అక్కడి అపూర్వ శిల్ప సంపద గురించి మరోసారి రాస్తాను. నదుల నడి మధ్యలో వికసించిన పువ్వులా ఉన్న కొండే పుష్పగిరి. అందుకే ఆ పేరు. ఆ నీళ్లలో అయిదు నదుల నీళ్లు కలసి ప్రవహిస్తున్నాయి. ఆ నదులే పెన్నా, పాపాఘ్ని, కుందూ, అర్కావతి,పాలార్. ప్రభుత్వం వాళ్ళు పంటల కోసం నీళ్లు వదిలినప్పుడు, కృష్ణా, తుంగభద్రా కూడా కలుస్తాయట. అక్కడి పూజారులు చెప్పారు. నదిలో నీళ్లలో నడిచి వెళ్లామని చెప్పాను కదా, అది చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎక్కడ గుంత ఏర్పడుతుందో, ఎక్కడ మేట ఏర్పడుతుందో తెలియదు. రెండోసారి వెళ్ళినప్పుడు, నీళ్ళల్లో దిగటానికి భయమేసేంత ప్రవాహం ఉంది. అప్పుడు మా సంశయాన్ని గమనించిన ఒక పురోహితుడు, ఆవలి ఒడ్డు నుంచి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వెంట బెట్టుకుని తీసుకు వెళ్ళాడు. లేకపోతే నీళ్ళల్లో బాట తెలియలేదు. ఒడ్డుకి చేరాక కొంచెం కొండ ఎక్కాలి. వానాకాలంలో పరిస్థితి ఇలా ఉంటే, ఎండాకాలంలో ఇసుకలో కాళ్ళు కాలిపోతాయి. మొత్తానికి అన్ని ఇబ్బందులూ దాటుకుని రెండుసార్లు పుష్పగిరి వెళ్లాం.
ఈ సారి పోస్టులో శృంగేరి పీఠంతో అప్పటి పీఠాధిపతి శ్రీ అభినవ విద్యాతీర్థ మహా స్వామి వారితో మాకున్న అనుబంధం గురించి వ్రాస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి