బామ్మా-పెట్టే-పంచాయతనం
భట్టిప్రోలు విజయలక్ష్మి
బామ్మ ఎక్కడికెళ్లినా, ఆవిడతో వచ్చేది ఆవిడ పెట్టె.
వచ్చీ రాగానే, కాళ్ళూ చేతులూ కడుక్కుని, స్నానం వేళ అయితే స్నానం కూడా చేసి, కాసేపు పడుకునేది. ఆతరువాత పెట్టె తీసేది. చెంగుకు తాళంచెవులు కట్టుకుని ఉండేది. నెమ్మదిగా పెట్టె తాళం తీసి, మా అమ్మని పిలిచి, "లీలా, ఈ పంచాయతనం లోపల పెట్టవే" అని ఓ డిజైనర్ బాక్సుని జాగ్రత్తగా అమ్మ చేతిలో పెట్టేది. మా అమ్మ కూడా భక్తిగా ఆ పెట్టె అందుకుని, వంటింట్లో దేవుడి అల్మైరాలో పెట్టేది. ఆ ఇత్తడి బాక్స్ కానీ, లోపల వున్న దేవుళ్ళ ఇత్తడి విగ్రహాలు కానీ నల్లగా ఉన్నాయనో, కిలుం పట్టాయనో, అనిపిస్తే, (సాధారణంగా అలాగే ఉండేవి) వాటిని చక్కగా ఉప్పు, చింతపండు పెట్టి తోమేది మా అమ్మ. ఆ ఇత్తడి బాక్స్ కూడా యెంత అందంగా ఉండేదంటే, చేతి పని అనుకుంటా. చక్కని డిజైన్ తో, ఆ డిజైన్ లోనే రంధ్రాలుండి లోపల వున్న విగ్రహాలకు చక్కగా గాలి తగిలేలాగా ఉండేది. దానికో గొళ్ళెం, వీలైతే తాళం కూడా వేసుకునేందుకు సౌకర్యం ఉండేది. మాకందరికీ లోపల విగ్రహాల కన్నా ఆ బాక్సే భలే నచ్చేది. అన్నట్టు ఆ బాక్స్ కి నాలుగు వైపులా కోళ్లు కూడా ఉండేవి. మా అమ్మ ఆ దేవుడి పెట్టె ధగధగా తోమేశాక అది బంగారం పెట్టె లాగ ఉండేది. లోపల విగ్రహాలు కూడా మా అమ్మ చెయ్యి పడ్డాక ధగధగా, తళతళా మెరిసిపోయేవి. "ఎంతైనా, నువ్వు దేవుళ్ళని చాలా శుభ్రంగా చూస్తావే", అని మా అమ్మని మెచ్చుకునేది బామ్మ.
ఇక లోపల వున్న దేవుళ్ళ విగ్రహాల గురించి చెప్తా. కాశీ అన్నపూర్ణాదేవి విగ్రహం చేతిలో వడ్డించే గరిటెతో సహా. సీతా రామ లక్ష్మణులా, లేక విష్ణుమూర్తి శ్రీదేవీ, భూదేవీ నా అనేది, ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు. మొత్తానికి చుట్టూ మకర తోరణంలో మధ్యలో మూడు విగ్రహాలుండేవి. లక్ష్మీదేవి విగ్రహం, ఇంకో విగ్రహం మోకాళ్ల మీద కూర్చుని చేతులు ముందుకి చాపి ఉండేది, భైరవుడా, గరుడుడా గుర్తు లేదు. ఇంకో నాలుగు చిన్న విగ్రహాలుండేవి. యెంత చిన్నవైనా ఒక్కోటీ ఓ రెండు వేళ్ళ వెడల్పుతో ఉండేవి. ఇదీ బామ్మ పంచాయతనం. పూజలు జరుగుతున్నప్పుడు ఆ బాక్స్ గొళ్ళెం తీసి, మూత వెనక్కి వేళ్ళాడేసి ఉండేది. విగ్రహాలన్నీ చక్కగా నుల్చోబెట్టి ఉంచి, వాటికి గంధం, కుంకుమ పెట్టి ఉండేవి. ప్రతి శుక్రవారం మా అమ్మ మొత్తం దేవుళ్ళన్నిటికీ 'పులికాపు' పెట్టేది. పులికాపు అంటే, దేవుళ్లన్నీ శుభ్రం చేసే కార్యక్రమం, గృహ స్థాయిలో, తిరుమలలో తిరుమంజనం లాగా అన్నమాట. మొత్తానికి ప్రతి శుక్రవారం దేవుళ్లన్నీ కొత్తగా తోమబడి, బొట్లు పెట్టి తళతళ లాడిపోయేవి. అంతే కాదు, ప్రతి శుక్రవారం పనిమనిషి చేత ఇల్లంతా కడిగించే వాళ్ళం. పనిమనిషి కడిగి వెళ్ళిపోయాక మా అమ్మ చక్కగా ముగ్గులు పెట్టేది. నాము అనే సున్నంముద్ద నీళ్ళల్లో నానేసి, దాంట్లో ఒక చిన్న గుడ్డముక్క వేసి ఆ గుడ్డముక్క సాయంతో, ముగ్గులు పెట్టేది అమ్మ. ఆ తడి ఎండిపోయాక ఆ ముగ్గులు తెల్లగా భలే మెరిసిపోయేవి. ఆ పనిలో నేనెప్పుడూ మా అమ్మకి సాయం చేయలేకపోయేదాన్ని, ఎందుకంటే, నాకు ముగ్గులు పెట్టటం అస్సలు రాదు. మా భారతి మాత్రం అద్భుతంగా ముగ్గులు వేసేది. అది ఆ విషయం లో మా అమ్మకి గొప్ప రైట్ హాండ్. ఇద్దరూ కలిసి ఇంట్లో అన్ని గదుల్లో మధ్యలోనూ, బార్డర్ లోనూ అందంగా చుక్కల ముగ్గులు, మెలికలు ముగ్గులు పెట్టేవాళ్ళు. పద్మక్కూడా ముగ్గులేయటం వచ్చు. నాకే రాదు. మొత్తానికి శుక్రవారం ఇల్లంతా కొత్త వాసన వేస్తూ బావుండేది.
సరే, బామ్మ పంచాయతనం దగ్గరకి వద్దాం. బామ్మ, ఒక్కో విగ్రహం చూపిస్తూ, ఇది ఉమాయ్ కాశీ నుంచి తెచ్చాడే, ఇదేమో హరి తెచ్చిచ్చాడు. ఇదేమో మధు ఇచ్చాడు, అంటూ ఒక్కో విగ్రహం గురించీ, ఒక్కో కథ చెప్పేది, ముచ్చట పడుతూ. మా ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాలన్నీ పడుకోపెట్టి, మూత మూసేసి, గొళ్ళెం బిగించి, దానికి ఓ తుండు చుట్టి మళ్ళీ తన పెట్టెలో పెట్టుకునేది. ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా ఆ పంచాయతనం పెట్టె వదిలేది కాదు. తనతో పాటు ఆ పంచాయతనాన్ని కూడా తిప్పుతూ ఉండేది. అది ఆవిడ ఆస్తి. ఎప్పుడూ వదిలిపెట్టేది కాదు. చాలా పొసెసివ్ గా ఉండేది, ఆ పెట్టె అన్నా, ఆ దేవుడి విగ్రహాలన్నా. అట్లాంటి బామ్మ చివరిలో ఓ రెండేళ్ల ముందు, మా అమ్మని పిలిచి, "లీలా, ఇక ఈ పంచాయతనం నీదే, నేనింక చెయ్యలేను. ఓపిక అయిపోతోంది. అందరినీ చూసా, నువ్వే బాగా శ్రద్ధగా చూస్తున్నావు. ఇక నుంచీ కూడా నువ్వే చెయ్యి. నేను నాతో ఇకపై ఈ పెట్టె తీసుకు వెళ్ళను. నీదే బాధ్యత, నువ్వే చూడు." అనేసి తన పంచాయతనం మా అమ్మకి అచ్చంగా ఇచ్చేసింది. మా అమ్మ దాన్ని తనకు ఓపికున్నంతవరకు చేసింది. నాన్న పోయిన తరువాత అమ్మ ఓ ఆర్నెల్లపాటు అమెరికా వెళ్ళింది. అప్పుడు మా పెద్ద పెదనాన్న పెద్ద కోడలు సత్యవతి వదినను పిలిచి, "నందివాడ ఇంటికి పెద్ద కోడలివి, మా అత్తగారు నాకు ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నాను. ఇక ఈ బాధ్యత నీదే." అని చెప్పి ఆ పంచాయతనం డబ్బా ఇచ్చేసింది. దాంతో ఈ తరానికి ఆ పంచాయతనం కథ అలా మొదలైంది.
అన్నట్టు మా ఉమా పెదనాన్న కాశీ నుంచి బామ్మకు ఒక పెద్ద అద్దాన్ని తెచ్చి ఇచ్చాడు. చుట్టూ మంచి అందమైన ఫ్రేమ్ ఉండేది. అది బెల్జియం అద్ధంట. చాలా స్పష్టంగా కనిపించేది. మా హాలులో తగిలించి ఉండేది. బామ్మతో పాటు ఆ అద్దం కూడా మా ఇంటికి వచ్చింది. మాతోనే ఉండిపోయింది. అమ్మ పోయాక ఆ అద్ధం చల్లమ్మత్తయ్య కూతురు నాగుకి ఇచ్చాం. కానీ అప్పటికి ఆ పాత ఫ్రేమ్ పాడై పోవటంతో నాన్న వున్న రోజుల్లోనే, కొత్త ఫ్రేమ్ చేయించాడు. కానీ ఈ ఫ్రేమ్ వల్ల దాని గాంభీర్యం పోయింది. దాని చరిత్ర వైభవం కాస్త తగ్గినట్టు, అది కూడా మామూలు అద్దం లాగానే అయిపోయినట్టు అనిపించేది. అంతకు ముందు దాకా ఆ అద్దం లోకి చూస్తూ తల దువ్వుకున్నా, బొట్టూ కాటుకా పెట్టుకున్నా, ఇది బెల్జియం నుంచి, కాశీ నుంచీ వచ్చిన అద్ధం, ఉమా పెదనాన్న తెచ్చి, బామ్మకు ఇచ్చిన అద్దం, అని అందరం అదో అష్టోత్తరంలా రోజూ తలచుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ అద్దం నాగు నుంచి వాళ్ళ చిన్నక్కయ్య లలిత దగ్గరకు చేరింది. అది ఆ అద్దాన్ని భద్రంగా ఉంచింది. ఇదేమో బామ్మ అద్ధం కథ.
ఇప్పుడు బామ్మ ఇనప్పెట్టె దగ్గరకు వద్దాం. ఆ పెట్టె తాళం చెవులు ఎప్పుడూ బామ్మ చెంగుకే ఉండేవి. ఎప్పుడూ ఆ పెట్టెని తానే తీసి సద్దుకునేది. అప్పుడప్పుడు ఆ కీస్ నా చేతికి కూడా ఇచ్చి పెట్టె తెరచి ఏదో ఇమ్మనేది. ఇంతకీ ఆ పెట్టెలో ఏమేమి ఉండేవంటే, బామ్మ బట్టలు, ఒకటో రెండో స్తోత్రాల పుస్తకాలు, పటికబెల్లం సీసా, హార్లిక్స్ సీసా, కిస్మిస్ పళ్ళ సీసా, ఎండు ఖర్జూరాల డబ్బా, హోమియోపతీ మందుల డబ్బా, తేనే సీసా, ఫోర్ హాన్స్ టూత్ పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, దువ్వెన, ఓ పర్స్, దాంట్లో కాసిని నోట్లు, చిల్లర మొదలైనవి ఉండేవి. బట్టలు మాత్రం ఏనాడూ నేను అయిదు ఆరు పంచెల కన్నా ఎక్కువ చూడలేదు. ఆ కొద్ది బట్టల తోనే ఆవిడ రోజులు గడిపేసేది. అన్నీ 10 అడుగుల తెల్లని పంచెలే కనుక అవి ఎన్నున్నాయి, అనే ప్రశ్న కనిపించేదే కాదు. ఇంకో విషయమేమంటే, ఆ పంచెలు భలే తెల్లగా ఉండేవి. ఆ రోజుల్లో మా అమ్మ ఏ సబ్బులు వాడేదో, పనిమనిషి అంత బాగా ఎలా ఉతికేదో నాకు తెలియదు. బామ్మ అంత తెల్లని రంగు ఎలా మైంటైన్ చేసేదో ఇప్పటికీ నాకు శేషప్రశ్న.
పొడి దగ్గు వస్తే, పటికబెల్లం బుగ్గన వుంచుకునేది, ఒక్కొక్కప్పుడు మాకూ ఇచ్చేది. కఫంతో కూడిన దగ్గు వస్తే 'ఓ చెంచా తెండి' అని దాంట్లో తేనె వేసుకుని నాకేది. మేమంతా పండ్లపొడి వాడితే, ఆవిడ మాత్రం టూత్ పేస్ట్ వాడేది. బహుశా అది కూడా ఏ కొడుకో అలవాటు చేసి ఉంటాడు, అందుకే ఆవిడ ఆ అలవాటు వదలలేదు, అని నా అనుమానం. రాత్రిపూట రెండు ఖర్జూరం పండ్లూ, నాలుగు కిస్మిస్ పళ్ళూ నీళ్ళల్లో వేసి మంచం కింద పెట్టుకునేది. పొద్దున్న ముందుగా మొహం కడుక్కున్నాక, ఆ నీళ్లు తాగి, ఆ నానిన పళ్లముక్కలు నమిలి తినేసేది. తరువాత హార్లిక్స్ సీసా తీసి మా అమ్మకు ఇచ్చి హార్లిక్స్ కలిపించుకుని తాగేది. మళ్ళీ ఆ హార్లిక్స్ సీసా మామూలుగా లోపల పెట్టేసేది. బహుశా ఈ అలవాట్లే, ఆవిడ ఎప్పుడూ మంచాన పడకుండా దాదాపు 80 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకు లాగేసింది. ఇవీ బామ్మ పెట్టె వివరాలు. అంతగా తాళాలు బొడ్లో పెట్టుకు తిరుగుతోందీ, లోపల ఏముందో అంటే, ఏముందీ వడ్లగింజలో బియ్యపుగింజ. అంతే. ఇదీ మా బామ్మ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి