మా బామ్మ ఆచారం-మా వంటిల్లు
భట్టిప్రోలు విజయలక్ష్మి
మా బామ్మ మడీ ఆచారం తెలియని వారుండరు. ఎక్కడికి వెళ్లినా సరే, ఎవరింట్లో వున్నా సరే, అందరూ ఆవిడకి కావలసిన తీరుగా చెయ్యాల్సిందే. బామ్మ స్నానానికి తయారు అయ్యేముందే మా అమ్మ మూడొంతుల వంట చేసేసేది. అప్పుడు మా బామ్మ లేచి వెళ్లి స్నానం చేసి వచ్చేది. 80 ఏళ్ళ వయసులో కూడా చక్కగా తనకు తానే నాలుగైదు మెట్లు దిగి స్నానాల గదికి వెళ్లి స్నానం చేసి వచ్చేది. ఏనాడూ ఆవిడ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లిన గుర్తు లేదు. ఒక పెద్ద 10 గజాల తెల్లని పంచె కట్టుకునేది. జాకెట్టు వేసుకునేది కాదు. అయినా ఏనాడూ ఆవిడ ఆ స్పృహ తనకు కానీ మరొకరికి కానీ కలిగేలా ఉండేది కాదు. అసభ్యంగా కానీ, అశ్లీలంగా గానీ అసలు అనిపించేదే కాదు. ఎప్పుడు చూసినా తెల్లని గ్లాస్కో పంచెలో రాజమాత లాగానే ఉండేది. సరే, స్నానం చేసి వచ్చి మడిబట్టలు కట్టుకుని, కాసేపు దేవుడి అల్మైరా దగ్గర తనకు తోచిన జపం చేసుకుని "ఏమే లీలా, వంట అయిందా" అనేది. "ఆ, అయింది" అంటూ మా అమ్మ మహానైవేద్యానికి సిద్ధం చేసేది. ఆవిడకి మూడ్ ఉంటే బామ్మే నైవేద్యం పెట్టేది, లేకపోతే, ఇవాళ నువ్వు పెట్టవే, అని లేచి తన పీట మీద కూర్చునేది. అన్నేళ్లు వచ్చినాక కూడా దాదాపు చివరి 10 రోజులవరకు కూడా ఆవిడే లేచి వచ్చి, చక్కగా కింద పీట మీద కూర్చుని తినేది. కంచంలో అన్నీ వడ్డించి ఒక్కోసారి మ్మా అమ్మ పక్కకు తప్పుకునేది. ఒక్కోసారి పక్కనే నుంచునో, కూర్చునో వడ్డించేది. మా బామ్మకు మా అమ్మ మీద ఎక్కువ ప్రేమో, జాలో కలిగితే, " లీలా, నువ్వూ కూర్చో, ఆలస్యం అయిపొయింది" అనేది. ఒక్కోసారి, "తింటుంటే చూడకూడదు తప్పు, దిష్టి కొడుతుంది. నాకు కావాలంటే నేను వడ్డించుకుంటాలే" అనేది.
ఒకసారి అలా పక్కకు తప్పుకోమని చెప్పిన రోజు, పాపం ఆవిడకేదో అవసరం వచ్చింది, ఆ పచ్చడో, నీళ్ళో యేవో దగ్గరలేవు. ఆవిడ లేవలేదు, అందుకోలేదు. పాపం అప్పుడు ఆవిడ అవస్థ చూడలేక మా అమ్మ వెళ్లి గబుక్కున ఆ నీళ్ల చెంబు దగ్గరకి జరిపింది." అయితే చూస్తూనే వున్నావన్నమాట" అంది బామ్మ. మా అమ్మేమో, "మరి మీకేమన్నా కావాలంటే ఎలాగండీ" అంది. పాపం బామ్మ మాట్లాడలేదు. ఆ తరువాత ఒకసారి, మా అత్తయ్యతో, " లీల పాపం చాలా మంచిదే, నన్ను కనిపెట్టుకుని చూసుకుంటుంది" అని చెప్పింది. ఆవిడ కున్న ఎనమండుగురు కోడళ్ళలోనూ మా అమ్మే ఆవిడ ఇష్టసఖి. బామ్మవి కళాకళలు. ఒక్కోసారి ఒకోలా ఉండేది. అన్నట్టు మా బామ్మా, మా అమ్మా ఇద్దరూ నండూరి వారి ఇంటి ఆడపడుచులు. మాబామ్మ యెంత పెద్ద వాళ్ళనైనా కేర్ నాట్ అన్నట్టు వుండేది. అవతలివాడు ఎవడనేది చూసేది కాదు. ఒక్క డాక్టర్ పుల్లయ్యగారిని, కంటి డాక్టరు సూర్యనారాయణ గారిని, మా ఇంటి ఓనర్ కృష్ణ ప్రసాద్ గారిని మాత్రం మీరు అనేది. మిగిలిన ఎవ్వరైనా సరే, డోంట్ కేర్ అన్నట్టు ఉండేది. ఎవ్వరినీ ముట్టుకునేది కాదు, ముట్టుకోనిచ్చేది కాదు. ఆ ఆచారం పాటించేది. మేం కూడా స్కూల్ నుంచి వచ్చాక కాళ్ళూ చేతులూ కడుక్కునే ఏమైనా చెయ్యాలి. స్కూల్ నుంచి రావటం, పుస్తకాలు అలమరలో పెట్టుకోవటం, ఆ తరువాత బాత్రూముకి వెళ్లి కాళ్ళూ చేతులూ కడుక్కుని తరువాతే ఏ పనైనా. ఈ రూల్స్ అన్నీ ఎవరు మొదలు పెట్టారో కానీ, మా ఇంట్లో మాత్రం పాటించేవాళ్ళం. లేకపోతే, ఆమ్మో, బామ్మో గట్టిగా అరిచేవాళ్ళు.
బామ్మకి భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలున్నాయి. వితంతువు కదా భోజనం మధ్యలో లేవకూడదు. ఒకవేళ లేవాల్సి వస్తే, ఇక మళ్ళీ కూర్చుని భోజనం చెయ్యకూడదు. ఇలాగే, ఒకసారి మా అమ్మా, బామ్మా కలిసి భోజనం చేస్తున్నప్పుడు, పొరపాటున, మా అమ్మ కంచం లోనుంచి ఒక టమాటో మాబామ్మ కంచంలోకి దూకిందిట. ఇద్దరూ భోజనం అప్పుడే మొదలుపెట్టారు, ఇంకా ఏమీ సరిగ్గా తినను కూడా లేదు. మా అమ్మ ఖంగారు పడింది, అత్తగారు కేకలేస్తుందేమో అని. మా బామ్మ అరుస్తానన్నట్టు ఉంటుంది కానీ, అరవదు. కరుస్తానన్నట్టు ఉంటుంది, కానీ కరవదు. ఆవిడ ఏమీ అనలేదు. మా అమ్మే కొంచం ఆలోచన చేసి, లేచి ఆవిడ విస్తరి తీసేసి, మళ్ళీ ఇంకో విస్తరి వేసి, మళ్ళీ అన్నీవడ్డించిందిట. అప్పుడు, ఇద్దరివీ యధావిధిగా భోజనాలు అయ్యాయట. ఇదో ప్రహసనం. ఈ విషయం నాకు మా శ్రీదేవి పిన్ని ద్వారా తెలిసింది. మా అమ్మ ఎప్పుడో మా పిన్నికి చెప్పిందట. బామ్మ మాత్రం ఎందుకు అరుస్తుంది, పొరపాట్లు జరగవా ఏంటి.
నా డ్యూటీ ఏంటంటే, భోజనాలు అయ్యాక ముందుగా పద్ధతి ప్రకారం పీటలన్నీ తీసి గోడకి ఆనించి పెట్టాలి. తరువాత ఎంగిలి గ్లాసులన్నీ తీసి అంట్లల్లో వెయ్యాలి. ఆ తరువాత కంచాలన్నీ తీసి అంట్లల్లో వెయ్యాలి. ఈ లోపల మా అమ్మ మిగిలిన గిన్నెలన్నీ సద్ది, పనిమనిషికి పెట్టేవీ, రాత్రికి వుంచుకునేవీ, పచ్చడి, మజ్జిగా, ఎప్పుడన్నా పులుసూ, లాంటివన్న మాట, విడివిడిగా సద్దేసేది. అప్పుడు నేను కింద పడ్డ మెతుకులూ ఎంగిళ్ళూ శుభ్రంగా తీసేసి, పసుపు నీళ్ళో, మామూలు నీళ్ళో చల్లేసి, ఆ తరువాత కొబ్బరి చీపురు పెట్టి తుడిచి, మళ్ళీ నీళ్లు చల్లి, గుడ్డ పెట్టి తుడిచేదాన్ని. ఇదంతా శుద్ధి కార్యక్రమం. మా బామ్మ, ఆడపిల్లకి పని రాకపోతే ఎలా, అన్నీ రావాలి, అనేది. లేకపోతే రేపు దాని అత్తారింట్లో మన్నే అంటారు, అనేది పైగా. చేస్తున్నాగా, బామ్మా, చూస్తున్నావుగా అనేదాన్ని, ఉక్రోషంగా. అలా భోజనాల కార్యక్రమం పూర్తి అయ్యేది.
రాత్రిపూట అయితే, ఇంకో ఎక్స్ట్రా కార్యక్రమం ఉండేది. అది వంటిల్లు కడగటం. ప్రతిరోజూ రాత్రి వంటిల్లు కడగాల్సిందే. లేకపోతే వంటిల్లు మైల వంటిల్లు కింద లెక్క. మర్నాడు మడి వంట చేయటానికి పనికిరాదు. మా బామ్మ లేకపోయినా, మడి వంట లేకపోయినా, మా ఇంట్లో మా అమ్మ ఏనాడూ రాత్రిపూట వంటిల్లు కడిగేది. అది శుభ్రం అనుకోండి, శుద్ధి అనుకోండి, ఆచారం అనుకోండి. మొత్తానికి అప్పటికి పని పూర్తి అయినట్లు లెక్క. ఆ తరువాత మా అమ్మ పాలు తోడేసి అన్నింటికీ మూతలు పెట్టి వచ్చి పడుకునేది. రోజూ అమ్మ వంటిల్లు కడుగుతుంటే నేను బయట నుంచి బోరింగు పంపు నుంచి చిన్న చిన్న బిందెలతో నీళ్లు తెచ్చి అందించేదాన్ని. పంపు వున్న ఆరు బయట ప్రాంతానికీ, వంటిల్లు పక్కనే వున్నా, ఓ నాలుగు మెట్లు ఉండేవి. నేను నీళ్ల బిందె గుమ్మంలో పెడితే అమ్మ అది తీసుకుని ఖాళీ బిందె మళ్ళీ ఇచ్చేది. అలా ఓ అయిదారు సార్లు నీళ్లు తెస్తే సరిపోయేవి. ఒకసారి అలా వంటిల్లు కడగటానికి అమ్మకి నీళ్లు అందిస్తూ, నేనప్పుడు ఏడో క్లాసులో వున్నా, ఆ తడి మెట్ల మీద జారిపడిపోయా. అదెక్కడో గుండెల్లో గుచ్చుకుంది. అమ్మా, అంటూ గుమ్మం దాటి వచ్చి పడిపోయా. కళ్ళు తిరగటం వరకు మాత్రమే తెలుసు, అంతే. తరువాత నాన్న పరుగెత్తుకు వచ్చి నన్ను ఎత్తుకు వచ్చి మంచం మీద పడుకోబెట్టాట్ట. ఆ పడుకోవటం, పడుకోవటం సుమారు ఓ నెల రోజులు మంచం మీదే వున్నా. ఫిట్ లాగా వచ్చిందట. పార్శ్వపు నొప్పి అటాక్ అయ్యిందిట. అది మా బామ్మకీ, మా నాన్నకీ వుంది. సరే, ఆ ఆస్తిని నాకూ పంచినట్టున్నారు. ఆ నొప్పి నాకు నలభై ఏళ్ళ వయసప్పుడు, కొలీగ్ శ్యామలా మేడం ఆక్యుప్రేజర్ చేసినప్పుడు తగ్గింది. ఆ తరువాత ఆ ఆక్యుప్రేజర్ నేనూ నేర్చుకున్నా. అది నాకూ, నాతోటి వారికీ చాలాసార్లు చాలా రకాలుగా ఉపయోగపడింది. ఆ నొప్పి ధర్మమా అని ఆ నెల రోజుల్లో బాగా చిక్కిపోయాను. బాగా చిక్కి పోయి వున్న నన్ను చూసి అందరూ, "ఈకలు పీకిన కోడిలాగా అయిపోయింది, పాపం" అనేవారు. ఈ ఈకలు పీకిన కోడి ఏమిటి, అది ఎలా ఉంటుంది, అని ప్రశ్న ఒకటి కొత్తగా మొదలైంది నాకు. బామ్మనీ, అమ్మనీ అడిగితే తిట్టారు, కోడి గొడవ నీకెందుకే అని. ఎన్నాళ్ళ తర్వాతో పెద్దయ్యాక చికెన్ షాప్స్ లో వెళ్ళాడుతుంటే చూసా, 'ఛీ, యాక్, ఇదా ఈకలు పీకిన కోడి, నేను ఇలా వుండేదాన్నా' అని భలే అసహ్యమేసింది.

ఇవన్నీ మేమే చేసినా, ఏదో బామ్మ కోసమే చేస్తున్నట్టూ, ఆవిడ పర్యవేక్షణలోనే చేస్తున్నట్టూ అనిపించేది. ఒక్కోసారి బామ్మ మా అమ్మకి పరీక్షలు పెట్టేది. అగ్నిపరీక్షలు కాదు కానీ, అప్పటికప్పుడు ఏదో చెప్పి వండమనేది. వండగలిగేదే చెప్పేదనుకోండి. ఒకసారి, కంచం ముందు కూర్చోబోతూ, "లీలా, పెసరపచ్చడి తినాలనుందే" అన్నది. పాపం మా అమ్మ, కాసిని వేన్నీళ్లు పెట్టి కాస్త పెసరపప్పుని అర్జెంట్ గా నానేయించి, రోట్లో నూరి పోపు వేసి పెట్టిందిట. తిని బయటకొచ్చి, అందరికీ చెప్పింది, లీల నాకోసం అప్పటికప్పుడు పెసరపచ్చడి అడగంగానే చేసిందీ అని. మా అమ్మ కూడా బామ్మకి భయపడేది కానీ, మళ్ళీ ఆవిడంటే ఏదో ఇష్టమే, అన్నీ చేసిపెట్టేది. ఒకరకంగా ఇంటిల్లిపాదికీ ఆవిడంటే హీరో వర్షిప్పే ఉండేది. ఆడదానికి హీరో వర్షిప్ ఏమిటా అనుకుంటున్నారా, ఆవిడ హీరోయిన్ కాదు, హీరోనే, అందుకే అలా అన్నా.
దాదాపు బామ్మకి 65, 70 ఏళ్ళు వచ్చిందాకా ఆవిడే అందరికీ మడి కట్టుకుని వంట చేసి పెట్టేది. ఆవిడ ఆచారానికి ఆవిడే వండుకోపోతే సరిపోయేది కాదు. ఓపిక తగ్గుతూ ఉండటంతో, కొన్నాళ్లు ఆవిడ చీఫ్ చెఫ్, మా అమ్మ అసిస్టెంట్ చెఫ్ గా వుండేవాళ్ళు. నెమ్మదిగా మా అమ్మే చీఫ్ చెఫ్యై పోయింది. మా పెదనాన్నల ఇళ్ళకీ, అత్తయ్యల ఇళ్ళకీ వెళ్ళేది కానీ, వెళ్లిన పనైపోంగానే వెంటనే వచ్చేసేది. ఒక్క ఉమా పెదనాన్నా, హరి పెదనాన్నా వాళ్లింట్లోనే, మా ఇంటి తరవాత ఎక్కువ రోజులుండేది. బామ్మ మా దగ్గర ఉండటంతో సెలవలకి అత్తయ్యలూ, పిల్లలూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు మాత్రం నాకు ఎక్కువ పనుండేది కాదు. ఆ పనేదో, వాళ్ళూ వాళ్ళూ చూసుకునే వాళ్ళు. చల్లమ్మత్తయ్య, సరోజినత్తయ్య వచ్చినంతగా, పెద్దత్తయ్య వచ్చేది కాదు. పాపం ఆవిడ ఇల్లు హైద్రాబాదులో మరో సత్రం. మాఇల్లు ఒకటి, పెద్దత్తయ్య ఇల్లు ఒకటి, ఉమా పెద్దనాన్న ఇల్లు ఒకటీ, ఈ మూడు ఇల్లూ మూడు సత్రాలు. ఎప్పుడూ వచ్చే పోయే వాళ్ళతో మహా సందడిగా ఉండేవి. మా ఇంటికి మా బంధువులు మాత్రమే వస్తే, ఉమా పెదనాన్న వాళ్ళింటికి ఎక్కడెక్కడి బంధువులో వచ్చే వాళ్ళు. కాకపోతే వాళ్ళింట్లో ఆ రోజుల్లో వంటమనిషి ఉండేది ఎప్పుడూ. పెద్దత్తయ్య ఇంటికేమో హైదరాబాదు వచ్చే వాళ్ళూ, అక్కడ చదువుకునే వాళ్ళూ, అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళూ, సెలవలకి వచ్చి పోయే, చెళ్ళెళ్ళూ, ఒక్కోసారి వాళ్ళ పురుళ్ళూ, ఇలా కోలాహలంగా ఉండేది. మా బామ్మ మడీ ఆచారం మా పెద్దత్తయ్యా వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది. మా పెద్ద మామయ్యగారు చాలా నిష్ఠగా నిత్యం పూజ చేసేవాళ్ళు. శ్రీచక్రార్చన కూడా ఉండేది వాళ్ళింట్లో. ఇక్కడ మా అమ్మ లాగా, అక్కడ మా పెద్దత్తయ్య కూడా ఎప్పుడూ పనిలో ఉండేది పాపం. బామ్మ తరవాత అందరికీ ఆవిడే అమ్మ.
మళ్ళీ మా బామ్మ దగ్గరికి వద్దాం. ఆవిడ వంట చేసిందంటే, ఆ ఘుమ ఘుమలకి చుట్టుపక్కల అందరూ ఏం వండుతోందో అని ఆసక్తిగా చూసేవారట. ముక్కలపులుసు ఆవిడ స్పెషాలిటీ. కేవలం బీరకాయ, లేకపోతే సొరకాయ, వంకాయ ఇలా వేసి ఒక్కోసారి పులుసు పెడితే ఆ పోపు వాసనలకే అందరూ ఎప్పుడు వంట అయిపోతుందా, భోజనానికి పిలుస్తుందా అని చూసేవారట. అవి అన్నీ చిన్నప్పుడు తిన్నానేమో గానీ, ఏవీ గుర్తు లేవు. నాకు వూహ తెలిసేసరికి మా బామ్మ కూరలు తరిగి ఇస్తుంటే, మా అమ్మ ఆవిడ పర్యవేక్షణలో వంట చేసేది. కానీ ఆవిడ వంట మాత్రం ఎవరికీ రాలే. కానీ అందరూ బాగానే చేస్తారు కానీ, మా నాన్న, మా అమ్మ వంటే వేరు అనేవాడు. తాను కూడా ఎప్పుడన్నా అవసరానికి వంట చేసేవాడు కానీ ఆ వంటలో ఎక్కువ ఐటమ్స్ ఉండేవి కావు, కానీ నాన్న వంట మాత్రం అద్భుతంగా ఉండేది. నాక్కూడా నాన్న వంట కొంచెం గుర్తు. నాకు 10, 11 ఏళ్ళు వచ్చినప్పటి నుంచీ, అమ్మే వంట చేసేది. ఆవిడ ఇంట్లో లేకపోతే నేను వంట చేసేదాన్ని. పాపం మా అమ్మ పుట్టింటికి వెళ్లిన గుర్తు కూడా లేదు నాకు ఎప్పుడూ. ఎంతో అవసరం వస్తేనే, లేకపోతే ఏదైనా పెళ్లి ఉంటేనేనో మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. బామ్మ కూడా వెళ్ళమని కానీ, వెళ్ళద్దని కానీ ఏదీ అనేది కాదు. మా అమ్మ 'కలవారి కోడలు కలికి కామాక్షి' నాకు వూహ తెలిసాక ఓ ఐదారుసార్లు పుట్టింటికి వెళ్ళిందేమో, అంతే.
బామ్మ కూడా అంతే, వాళ్ళ నాన్న పోయాక ఏనాడూ పుట్టింటికి వెళ్లలేదట. వాళ్ళ అన్నగారితో చిన్న మాట తేడా వచ్చి ఇంకా ఆ ఇంటి గడప తొక్కను అనేసి, మళ్ళీ తిరిగి వెళ్ళలేదుట. తప్పనిసరిగా వెళ్లాల్సిన సందర్భం వచ్చినా కూడా, ఆలయానికి వెళ్లి అక్కడ నిద్ర చేసి ఇంటికి వెళ్లిపోయేదట. అంత పంతం ఆవిడకు. యెంత పంతం, కోపం, దాష్టీకం వున్నా, బామ్మలో ఒకరకమైన ధర్మం, న్యాయం ఉండేవి. ఒకసారి మాఅమ్మా, రాజ్యం ఆమ్మా, ఇద్దరూ అత్తగారు ఇంట్లో లేదు కాబోలు అనుకుని కబుర్లు మొదలెట్టారట. నెమ్మదిగా ఆ మాటలు అత్తగారి వల్ల వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో చెప్పుకోవడం దాకా వచ్చాయట. ఈ విషయం అమ్మే చెప్పింది నాకు. ఆలా కొంచం సేపు కష్టాలు చెప్పుకున్నాక వెనక్కు తిరిగి చూస్తే, మా బామ్మ అక్కడే నుంచుని అవన్నీ వింటోందిట. ఇంకేముందీ, ఇద్దరికీ గుండెలు జారిపోయాయి. ఇన్ని విన్నాక అత్తగారు ఏమంటుందో అని వణుకు పుట్టిందట. కానీ మా బామ్మ అవన్నీ విని కూడా, వీళ్ళని ఒక్కమాట కూడా అనకుండా ఇద్దరినీ ఒకసారి తేరిపార చూసి లోపలికి వెళ్లిపోయిందట. మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు బాబూ, అని అమ్మా, ఆమ్మా అనుకుని వెంటనే లేచి ఇంట్లోకి వెళ్లిపోయారట.
అత్తల గురించి అనుకోని కోడళ్ళూ వుండరు, కోడళ్ల గురించి అనుకోని అత్తలూ వుండరు. అమ్మల కన్నా అత్తలు కళ్ళల్లో పెట్టుకుని చూసినా కోడళ్ళకి తల్లే ఎక్కువ. అలాగే, కోడళ్ళు కూతుళ్ళ కన్నా సుఖంగా చూసినా అత్తలకి కూతుళ్లే ఎక్కువ. ఇక్కడ ఒక చిన్న కథ గుర్తొస్తోంది. చెప్తాను. ఒకసారి ఒక అత్తగారిని ఎవరో అడిగారట, "మీకు కూతురు ఎక్కువ ఇష్టమా, కోడలు ఎక్కువ ఇష్టమా" అని. ఆ అత్తగారేమో, " నాకు కూతురు పంచదారతో సమానం. కోడలు ఉప్పుతో సమానం" అని చెప్పిందట. అది విని కోడలు, " మీకు ఏం తక్కువ చేశానని నన్ను ఉప్పు, మీ అమ్మాయిని పంచదార అంటున్నారు" అని అడిగిందట. అప్పుడు ఆ అత్తగారు, " అవునమ్మా, నాకు కూతురు వస్తే హాయిగా స్వీట్ తింటున్నట్టు ఉంటుంది, అందుకే దాన్ని పంచదారతో పోల్చాను. నువ్వు లేకపోతే ఇంటికి కళే లేదు, ఉప్పు లేని వంటలా, అందుకే నిన్ను ఉప్పుతో పోల్చాను" అందిట. ఇదీ అత్తాకోడళ్ల సంబంధం లోని జీవిత సత్యం.
ఈ సారి మా బామ్మ పెళ్లి తోనో, మా అమ్మ వాళ్ళ తాతమ్మ, అంటే అమ్మా వాళ్ళ తాతయ్యా వాళ్ళ అమ్మ ముచ్చట్లతోనో పోస్ట్ పెడతాను.

Vijaya excellent narration of golden days. Yes your Bamma a hero and in fact that generation ladies were all having great virtues. They were clever, intelligent,their patience and tolerance had no boundaries. We are blessed that to learn so many things from them.I am happy that you are passing on all those positivities of life to the next generation through your blogs.
రిప్లయితొలగించండిAkkaya Garu ma Bamma kuda same Due to your blog I remember her memories recently she passed away Thanks a lot for sharing such a beautiful memories of your Bamma. ��
రిప్లయితొలగించండిAkkayya, thanks to you, I am learning so much about Bamma! She is indeed a hero! Nanna, always used to say that..
రిప్లయితొలగించండిExcellent narration aunty.... mee memory ki hatsoff
రిప్లయితొలగించండి