నండూరి లీలాకుమారి + నందివాడ శ్రీరామకృష్ణశర్మ
భారతి తరవాత పద్మ, పూర్తి పేరు పద్మావతి. నాకెందుకు లక్ష్మి వచ్చేలా పేరు పెట్టలేదు అని చాలా గోల చేసేది. దీనికి మా అమ్మలా చాలా లావు, బోల్డు పొడుగుతో జడ. చిన్నప్పుడు బోల్డు బొద్దుగా వుండేది గానీ, పెద్దయ్యాక సన్నబడి పోయింది. అయితేనేం బబ్లింగ్ ఎనర్జీతో వుండేది ఎప్పుడూ. ఇప్పుడూ అంతే అనుకోండి. మహా కన్నింగ్, ఒక్క పని చేసేది కాదు, అక్కలిద్దరున్నారుగా అని తప్పించుకు తిరిగేది. నేను భోజనాలు వడ్డిస్తే, భారతి అందరం తిన్నాక టేబుల్ శుభ్రం చేసేది. 'మరి నువ్వేం చేస్తావే పద్మా' అంటే 'తింటాగా' అనేది. భోజనం చెయ్యంగానే ఎక్కడ కంచాలు యెత్తాల్సి వస్తుందోనని 'అర్జెంట్' అని బాత్ రూంలో దూరేది. ఒకసారి నేనూ, భారతీ కూడబలుక్కుని అది బాత్ రూంలోకి వెళ్ళాక, 'అన్నీ ఎత్తి, శుభ్రం చేసేసాం, రావే' అంటే, నిజమని నమ్మి వచ్చి చూసి చచ్చినట్టు శుభ్రం చేసింది. 'అయినా అన్నీ నాకే చెప్తారు' అని పోట్లాడేది. మేం కూడా 'నీకన్నీ చెప్తున్న మాట నిజమే, కానీ నువ్వేమీ చెయ్యటం లేదు' అనే వాళ్ళం. పొద్దున్న చపాతీలు చెయ్యవే అంటే, ఆ పనిలో ఎన్ని స్టెప్పులున్నాయో లిస్టు చదివేది. అంటే, డబ్బా తియ్యాలి, పిండి తియ్యాలి, బేసిన్ తియ్యాలి, నీళ్ళు పొయ్యాలి, కలపాలి, ఉండలు చేయాలి, వత్తాలి, పెనం పెట్టాలి, కాల్చాలి.............ఇలా ఈ స్టెప్పులు ఎప్పటికీ అయ్యేవి కావు. ఇంత రామాయణం ఎందుకే, 'చపాతీలు చెయ్యాలి అంటే చాలు' కదా అని మేం అనేవాళ్ళం. అది కూడా చిన్నప్పుడు యెంత పని తప్పించుకుందో, పెళ్ళయ్యాక దానికి అంతకి పదింతలు పని బాధ్యత పడింది. ఇప్పుడది యెంత పనికత్తో. మేం ఎవ్వరం దాని ముందు పనికి రాం. ఏం చెయ్యమన్నా క్షణాల్లో చేస్తుంది, చురుగ్గా చేస్తుంది, బాగానూ చేస్తుంది, ముగ్గులేస్తుంది, సంక్రాంతికి బొమ్మలు పెడుతుంది. మా అందరిలో ఇంకా వాళ్ళింట్లోనే కాస్త పద్ధతులూ, సంప్రదాయాలూ వున్నాయి. అది వాళ్ళ అత్తగారి ట్రైనింగు మహిమ. పద్మా, నేనూ, రాధిక(మా సరోజినత్తయ్య కూతురు) ఒక్కసారే ఎమ్మీడీ చేశాం. తరవాత పద్మ ఎంఫిల్ కూడా చేసింది. నేను మాథ్స్, భారతి ఫిజిక్స్, తీసుకున్నాం కదా, నువ్వు కెమిస్ట్రీ తీసుకోవే M P C పూర్తి అయిపోతుంది మనింట్లోనే అంటే, 'ఛీ నాకు కెమిస్ట్రీ చిరాకు, నేను ఇంగ్లీష్ తీసుకుంటా' అని ఎమ్మే ఇంగ్లీష్ చేసింది సైఫాబాద్ పీజీ కాలేజ్ లో. మంచి ఇంగ్లీష్ రాస్తుంది, మాట్లాడుతుంది. వాళ్ళ స్కూల్ ఫంక్షన్లకి, మాగజైన్లకి ఇంగ్లీష్ లో కవితలు, నాటకాలు రాస్తుంది. మంచి సరదా మనిషి. భారతి యెంత నిదానమో, ఇది అంత సరదా మనిషి. నేను గలగలా, భారతి నెమ్మదినెమ్మదిగా, ఇది కళకళా-జలజలా. పద్మకి ఆడపిల్లలంటే ఇష్టం. మొదట నాకు ప్రమోద్ పుట్టినప్పుడు, దానికి బోల్డు ఆశాభంగం. ఆడపిల్ల అని బోల్డు పేర్ల లిస్టు తయారు చేసుక్కూర్చుంది. దానికి నా మీద కోపం కూడా వచ్చింది, మగ పిల్లాడ్ని కంటుందా అని. ఆరోజుల్లో దాన్ని 'బెట్సీ ట్రాట్ వుడ్' అని పిలిచే వాళ్ళం. డేవిడ్ కాపర్ ఫీల్డ్ లో ఆ పేరు గల ఒక పాత్ర డేవిడ్ పుట్టాడని, ఆడపిల్ల పుట్టలేదని అలిగి వెళ్ళిపోతుంది. తరవాత నాకు ప్రదీప్ పుట్టాడు. ఇంకా కోపం పెరిగి పోయింది. 'నీకే మగ పిల్లాడు పుడితే ఏం చేస్తావే, వాడి ముడ్డీ మూతీ కడిగి పెంచవా' అంటే, 'సింక్ లో పెట్టి టాప్ తిప్పి కడిగేస్తా' అనేది. ఆ తరువాత భారతికి సుధీర్ పుట్టినప్పుడు అయితే దానికి వైరాగ్యం వచ్చేసింది, ఇంకా అంతా మగ పిల్లలే పుడతారు కాబోలని. భారతీ వాళ్ళాయన, వెంకటేశ్వరరావు గారు, 'అన్నం మీరెవరైనా వడ్డించండి, అమ్మాయి పుట్టలేదని పద్మ గరిట పెట్టి ఒక్కటి నెత్తి మీద కొడుతుందేమో' అని జోకులేసేవాడు. మా ఇంట్లో నాలుగో మనవడిగా పద్మకే శ్రీకాంత్ పుట్టాక, నోరు మూసుకుని చక్కగా పెంచింది. పాపం దేవుడు కూతురు కావాలనే దాని కోరికని 'శ్రీరాజిత' రూపంలో తీర్చాడు. అప్పుడు మా అమ్మ, 'కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, దీనికి ఆడపిల్ల దొరికింది' అన్నది. మా ఇంట్లో అందరికీ ఆడ పిల్లలున్నారు, నాకు తప్ప, అయినా నో రిగ్రెట్స్. మేమయినా డిజైన్ చేసుకు కన్నామా, ఎవరు పుడితే వాళ్ళే, అంతే.
= మేమందరం
భట్టిప్రోలు విజయలక్ష్మి

తరవాత వాడు వివేకానందు, బాబు అని అనేవాళ్ళం, మాకు వాడు ఇప్పటికీ బాబే. వాడి పూర్తిపేరు చాలా పొడుగు. నందివాడ వెంకట సత్య శేష వివేకానంద శర్మ, వెంకట-తిరుపతి దేవుడికోసం, సత్య మా అమ్మా వాళ్ళ నాన్న పేరు, (సత్యనారాయణ లోంచి సత్య), మా ఇంట్లో నాగ దోషం వుందని శేష, వివేకానందుని సెన్టెనరీ సెలెబ్రేషన్స్ అవుతున్నాయి ఆరోజుల్లో, అదీకాక నాన్న రామకృష్ణామఠంలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు, అందుకని వివేకానంద్. ఆనంద్ కి ఇంకో కారణం కూడా వుంది, మా తాతయ్య (నాన్నావాళ్ళ నాన్న) పేరు ఆనంద రామయ్య, ఆయన పేరుతో మా ఇంట్లో అయిదుగురు ఆనందులు వున్నారు, సరే చివర్లో శాస్త్రానికి శర్మ. ఇదీ వాడి పేరు చరిత్ర. అన్నీ పోయి ఇంట్లో పిల్చుకోవటానికి బాబు మిగిల్తే, బైట స్కూల్లో రాయటానికి వివేకానంద్ మిగిలింది. నేనూ, పద్మా ఆరుగొలన్లో పుడితే, భారతీ, బాబూ బెజవాడలో పుట్టారు. ముగ్గురు ఆడపిల్లల తరవాత మగపిల్లాడని అందరూ వాడిని బాగా గారం చేసేవాళ్ళం. వాడికీ నాలాగా బాగా మొండితనం, పెంకితనం అలవాటయ్యాయి. పేచీలు పెట్టి ఏడిపించుకు తినేవాడు. ఆ పేచీలు కూడా తీర్చేలాగా ఉండేవి కావు. అర్ధరాత్రి లేచి కూర్చుని 'నాకు గారెలు కావాలీ' అని ఏడ్చేవాడు. 'సరే, రేప్పొద్దున్న చేస్తా' అనేది మా అమ్మ. 'కాదు, నాకు ఇప్పుడే కావాలీ' అని ఏడ్చేవాడు. 'ఇంత రాత్రివేళ గారెలు ఎలా వస్తాయిరా, పొద్దున్నే చేస్తానులే' అనేది అమ్మ. వినేవాడు కాదు. గట్టిగా శ్రుతి పెంచి ఏడ్చేవాడు. ఆ రోజుల్లో ఫ్రిజ్జులు లేవు కదా, అప్పటికప్పుడు గారెలు వండటానికి. గారెలు కావాలంటే, పప్పు నానేసి, కడిగి, పొట్టుతీసి, రుబ్బి, గారెలు చేయాలి. అర్ధరాత్రి అవి అన్నీ ఎలా? వినేవాడు కాదు. 'పడుకోరా', అంటే, 'నేను ఏడుస్తా, నువ్వు పడుకో' అనేవాడు. చెప్పి చెప్పి మాఅమ్మ పడుకునేది. వాడు ఏడుస్తూ, లాభం లేదని, ఎప్పుడో పడుకునేవాడు. అన్నం వడ్డించేటప్పుడూ అంతే, పొరపాటున ఏదైనా ఆధరువు కొంచెం ఎక్కువ వాడి కంచంలో పడితే గోల గోల చేసేవాడు. అది తీసేయ్యమనేవాడు. తీసేసి మాకెవరికైనా వేస్తుంటే, ఎవరికీ వెయ్యటానికి వీల్లేదనేవాడు. సరేలే, నేను తరవాత తింటాలే, అంటే అదీ కుదరదనేవాడు. పోన్లే, పారెయ్, అంటే ఒప్పుకునేవాడు కాదు. మరేం చెయ్యార్లా, అంటే నాకు తెలియదనేవాడు. 'తన కంచంలో వుండకూడదు, ఎవరికీ పెట్టకూడదు, అమ్మ తినకూడదు' అని చాలా కండిషన్లు పెట్టేవాడు. చివరికి ఆ పప్పో, కూరో, పచ్చడో, గోడల మీదకి, బిందెల మీదకీ విసిరిసిరి కొట్టేవాడు. అందుకే అమ్మ వాడికి ఏమైనా వడ్డించేప్పుడు చాలా జాగ్రత్తగా వుండేది. ఇప్పుడేమో, వాడు చాలా పెద్దమనిషి, మహా సర్దుకుపోయే తత్వం. పిల్లల్ని, భార్యని యెంత బాగా, బాధ్యతగా చూసుకుంటాడో, యెంత పనిమంతుడో. అమెరికా వెళ్ళితే అన్ని బాధ్యతలూ తెలుస్తాయి కాబోలు. నాగపూర్ VRCE లో బీటెక్ చేశాక, న్యూజెర్సీ NJIT లో ఎమ్మెస్ చేశాడు. అప్పట్నుంచీ న్యూజెర్సీలోనే ఉంటున్నాడు గత పాతికేళ్ళుగా. వాడికీ, నాకూ నాన్న పోలికలెక్కువని అందరూ అంటారు. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. మేమందరం అంటే చాలా ఆపేక్ష. నాన్న పోయాక అమ్మకి ఏం కావాలంటే అన్నీ చూసేవాడు. అమ్మ కోసం ఏనాడూ డబ్బు ఖర్చుకి వెనకాడలేదు. ఈ మూడు కుటుంబాల గురించీ ముందు ముందు రాస్తాను.
తరవాతది వరలక్ష్మి, చిన్న పాపాయి అనే వాళ్లం. చాలా బావుండేది. ఎంత తెల్లగా ఉండేదో, భారతి కన్నా తెల్లగా వుండేది. కళ్ళు భలే చురుగ్గా ఉండేవి. చక్కగా కబుర్లు చెప్పేది. భారతి దాన్ని మరీ ముద్దుగా చూసేది. నోట్లో అన్నం పెట్టేది. పద్మని పెద్దపాపాయి అంటే వరలక్ష్మిని చిన్నపాపాయి అనేవాళ్ళం. అది పోయిన తరవాత కూడా పద్మని పెద్దపాపాయి అంటే అమ్మ ఏడుస్తోందని మేమే పద్మని పెద్దపాపాయి అనటం మానేసి పద్మా అని పిలవటం మొదలుపెట్టాం. అలా పద్మ పేరు బైటకు వచ్చింది. చిన్నపాపాయికి మూడోఏట స్కూల్ పని మీద నాన్న హైదరాబాద్ వెళ్ళాడు, ఓ వారం పని ఉంటుందని. హైయ్యర్ సెకండరీ స్కూల్ ని జూనియర్ కాలేజ్ గా మార్చేందుకు స్కూలు మేనేజ్ మెంట్ వాళ్ళతో కలిసి వెళ్ళాడు. నాన్న వెళ్ళేటప్పుడు చిన్న పాపాయి బాగానే వుంది. ఎందుకో రెండు రోజుల తరవాత దానికి జ్వరం వచ్చింది. పొద్దున్నించీ జ్వరం అయితే, అమ్మ నన్ను స్కూల్ కి వెళ్ళద్దంది. పాపం అది జ్వరానికి మాట్లాడలేకపోతుంటే, నీళ్ళు కూడా మింగలేక పోతుంటే, మాకు తెలియలేదు. అదేమిటో అర్ధం కాలేదు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఏ అనారోగ్యం వచ్చినా హోమియో మందులే. ఎల్లోపతీ ఎక్కువగా తెలియదు, ఖరీదని ఎప్పుడో చాలా అవసరం అయితే గానీ వాడేవాళ్ళం కాదు. నేను స్కూల్ కి పరిగెత్తుకెళ్ళి మా లెక్కలమాస్టారిని పిల్చుకొచ్చా. మాస్కూల్ కి నాన్న తరవాత ఆయనే ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్. ఆయన హోమియో డాక్టర్ కూడా. ఆయన వచ్చిమందులేసి మధ్యాన్నం లోగా తగ్గకపోతే ఎల్లోపతీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళమని చెప్పారు. ఆ రోజు ఎందుకో ఏ డాక్టర్లూ లేరు. నేను వెళ్లి వెతగ్గా వెతగ్గా, కొత్తగా అప్పుడే ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన డాక్టర్ కొత్తా రవీంద్రబాబు అని ఒకే ఒక డాక్టర్ దొరికాడు. ఆయన అమ్మని, పాపాయినీ తీసుకు రమ్మన్నాడు. పాపాయిని చూస్తూనే, నన్ను చూసి, నువ్వు వెళ్ళిపోయి వెంటనే ఎవర్నన్నా పెద్ద వాళ్ళని పంపించమన్నాడు. అమ్మని, చిన్నపాపాయినీ ఆయన హాస్పిటల్లో వదిలేసి, నేను వెళ్లి మా పీడీ సాంబయ్య గారిని పిల్చుకొచ్చా. ఆరోజుల్లో చిన్నపనికీ, పెద్దపనికీ, ఆడపనికీ, మగపనికీ అన్నింటికీ నేనే మా ఇంటికి. అప్పుడేమిటి, ఎప్పుడూ అంతే, ఇప్పటికీ అంతేనేమో. ఈ పీడీ గారు మాకు బెజవాడ రోజుల్నించే తెలుసు. ఒక రకంగా నాన్న బెజవాడ గాంధీ మునిసిపల్ హైస్కూల్ లో లెక్కల టీచర్ వుద్యోగం మానేసి, ఆవూరు వదిలి, తెనాలి తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్ కి హెడ్ మాస్టర్ గా రావటానికి పీడీ గారి నాన్న, జంధ్యాల భగవచ్చాస్త్రి గారే కారణం. ఆయనే నాన్నని ప్రోత్సహించి పంపించారుట. సాంబయ్యగారు ఏదైనా అవసరం వస్తుందేమోనని డబ్బు బీరువాలోంచి తీస్తుంటే కింద పడిపోయిందిట. తరవాత చెప్పారు. చిన్నపాపాయి ముద్దుగా ఉంటుందని అందరూ దాన్ని ముచ్చటగా, ముద్దుగా చూసేవారు. ఈ కొత్త డాక్టర్ నన్ను రానివ్వలేదు, నీ వయసు వాళ్ళు రాకూడదు అని. అమ్మ నన్ను 'ఇంటికెళ్ళిపో, ఇంట్లో ఏం కావాలో చూడు. బామ్మకి సాయం చెయ్యి, నాకు సాంబయ్య గారు తోడు ఉన్నారుగా ' అని పంపించేసింది. పొద్దున్నే లేచి అమ్మకి కాఫీ, పాపాయికి పాలు ఫ్లాస్కు లో పోసుకుని నేను, భారతీ బయల్దేరాం. హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు రాత్రే గుంటూరు పెద్దహాస్పిటల్ కి పంపించామని చెప్పారు. అంత పెద్ద జ్వరం ఏమిటో అర్ధం కాక మేము ఇంటికి వచ్చేశాం. బామ్మకూడా ఖంగారు పడింది, ఏమైందోనని. కాస్సేపట్లో ఏడుస్తూ అమ్మ కారు దిగింది, పాపాయిని గుడ్డల్లో చుట్టి పట్టుకుని. పాపాయి రాత్రే గుంటూరు అంటువ్యాధుల హాస్పిటల్లో పోయిందిట. పాపం ఆ కొత్తగా ఎంబీబీఎస్ చదువుకున్న కొత్తా రవీంద్రబాబుగారే పాపాయికి 24 గంటల జ్వరం, డిఫ్తీరియా వచ్చిందని చెప్పి, దానికి వైద్యం ఆ ఒక్క గుంటూరు అంటువ్యాధుల హాస్పిటల్లోనే వుందని చెప్పి, వెంటనే పంపించారుట. దానికి ఆపరేషన్ చేసే లోపునే అది చనిపోయిందిట. పాపం దాని చివరి క్షణాల్లో అది ఎంత బాధపడిందో అమ్మచెప్తే, అందరం ఏడిచేశాం. ఇప్పటికీ తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. బామ్మకూడా చతికిల పడిపోయింది. ఆజబ్బు పేరే మేమెవ్వరం అంతవరకూ వినలేదు. అందరూ యెంత సాయం చేసినా అది బతకలేదు. నాన్న హైదరాబాదు నుంచి వచ్చేసరికి మధ్యాన్నం అవుతుందని, ఆ వ్యాధితో చనిపోయిన పిల్లని ఎక్కువ సేపు ఉంచితే, ఇంట్లోనే కాదు, వీధిలో పిల్లలందరికీ కూడా ఆవ్యాధి రావచ్చనీ, అది చాలా ప్రమాదకరమైన అంటువ్యాధనీ, వెంటనే ఖననం చెయ్యమనీ డాక్టర్లు ముందే చెప్పి పంపించారుట. మా ఉమా పెద్దనాన్నే(నాన్నా వాళ్ళ అన్నయ్య) బెజవాడ నుంచి వచ్చి అన్నీ చేసేసాడు. అమ్మ గోలపెట్టి ఏడిచింది. నాన్న కారులో మధ్యాన్నం హైదరాబాదు నుంచి వచ్చాడు. అప్పటికి అంతా అయిపోయింది. ఆరోజుల్లో అది పుట్టినప్పుడు అమ్మ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. అందరూ అలా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటే తల్లీపిల్లల్లో ఒకరు చనిపోతారని భయపెట్టారుట. అయినా అమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుంది. బామ్మక్కూడా ఇష్టం లేదు. సరొజినత్తయ్య మాత్రం అమ్మ వేపు వుండి ధైర్యం చెప్పి అమ్మ పురుటికి సాయం వచ్చి, అమ్మ ఇంటికి వచ్చేదాకా వుండి వెళ్ళింది. అది పుట్టాక అమ్మకి చాలా జబ్బు చేసింది, చచ్చిపోతుందని భయపడ్డారందరూ. కానీ మా అదృష్టం, మళ్ళీ తగ్గి లేచి తిరిగింది. ఇలా చిన్నపాపాయి పోతే అవి అన్నీ తలచుకుని ఏడిచింది. ఆ ఆపరేషన్ అయ్యాక చాలా రెస్ట్ తీసుకోవాలిట. అమ్మకి ఆ రెస్ట్ జరగలేదు. బామ్మకి మడితో వంటా, ఇంటిపనీ ఇవ్వన్నీ ఉండేవి. పనిమనిషి వున్నా, వాళ్ళని వంటఇంట్లోకి రానిచ్చేవారు కాదు. అది కడిగిన గిన్నెలన్నీ మళ్ళీ తొలిచి తీసుకోవాలి, ఇంకా మన ఎంగిలి కంచాలు అది ముట్టుకోకూడదు, ఇన్ని నియమాలుండేవి ఆరోజుల్లో, ఆ వూళ్ళో బ్రాహ్మలకి. మేమూ అవ్వన్నీ పాటించేవాళ్ళం. ఇలా ఎప్పుడూ నీళ్లల్లొ వుండేసరికి అమ్మ ఆరోగ్యం పాడయ్యింది. అప్పుడే నేనూ ఇంటిపని చేయటం మొదలయ్యింది, అప్పుడు నేను ఆరోక్లాస్ లో వున్నా. నేను ఏడో క్లాస్ కి వచ్చేసరికి బామ్మకి వంట చేసే ఓపిక పోయింది. అమ్మే వంట కూడా చేసేది. దాంతో బామ్మఇంట్లో పనిలేక ఆవూరు, ఈవూరు తిరుగుతూ వుండేది. అమ్మ బైట చేరితే, ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఆ మూడు రోజులూ వేరే కూర్చునేవాళ్ళు ఎవరినీ, ఏ వస్తువునీ తాకకుండా. నేనే బామ్మకోసం మడి కట్టుకుని మరీ వంట చేసేదాన్ని. పాపం నాన్న చాలా రోజులపాటు అల్లాంటి అవసరాలు వచ్చినప్పుడల్లా వంటమనిషిని పెట్టేవాడు. తరవాత నేనే నేర్చుకుని వంట చేసేదాన్ని. ఈరోజుల్లో పిల్లలు పాతికేళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలే, అప్పుడే వంట నేర్పాలా అన్నట్టు తల్లితండ్రులు మాట్లాడటం చూస్తున్నాం. మొత్తానికి అలా మేమెంతో ముద్దుగా చూసుకునే మా చిన్నపాపాయి మా జీవితాల్లోంచి నిష్క్రమించింది. మేము అయిదుగురు కాస్తా నలుగురయ్యాం. అమ్మ ఆ బాధనుంచి చాలా రోజులు బైట పడలేదు. మాకోసం పాపం లేచి తిరిగేది. భారతి కూడా చాలా బెంగ పెట్టుకుంది. అమ్మ 'దాన్ని ఒక కంట కనిపెట్టుకుని వుండవే, అది ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది' అని చెప్పేది. అంత చిన్న వయసులో, నాకప్పటికి పదమూడేళ్ళు, ఇంత దగ్గరగా చావుని చూడటం నాకో అనుభవం. తరువాత మరో మూడేళ్ళల్లో బామ్మ ప్రాణం పోతున్నప్పుడు నేనూ పట్టుకునే వున్నా. బామ్మే కదా భయమేయలేదు. ఎందుకో చావంటే భయం అలా చిన్నప్పుడే పోయింది. మరో విషయం, నాన్న ఆతరువాత హైదరాబాదు నుంచి డిఫ్తీరియాకి టీకాలు తెప్పించి ఒక అయిదునెలలపాటు, నెలనెలా మాకే కాదు, వీధిలో పిల్లలందరికీ కూడా వేయించాడు. దటీజ్ రాంక్రిష్ణుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి