ఇల్లంతా కోలాహలం
మా బామ్మ మా అమ్మా వాళ్ళనాన్నని పిలిచి 'రాంకిష్టుడికి ఏమైనా సంబంధాలు చూడు సత్యం' అందిట. ఆయన సిన్సియర్ గా సంబంధాలు చూడటం మొదలుపెట్టాడట. అప్పుడు వూళ్ళో ఎవరో 'మీ ఇంట్లో వయసైన, వరసైన అమ్మాయిని పెట్టుకుని బైట సంబంధాలు చూస్తావా, వెళ్లి వియ్యమ్మ గారిని అడుగు, మీ లీలని రామకృష్ణకి చేసుకొమ్మని అడుగు', అని ధైర్యం చెప్పి తీసుకెళ్ళి అడిగించారుట. మా బామ్మ ముందు 'మళ్ళీ నండూరి వారి ఆడపడుచా' అని మరీ ఒప్పుకుందిట. పెళ్ళిచూపులకి మానాన్నతో పాటు మా చల్లమ్మత్తయ్య (నాన్నా వాళ్ళ చిన్నక్కయ్య) కూడా వెళ్ళిందిట. ఆవిడ మా అమ్మ పొడుగు జడ చూసి ఫ్లా.....ట్. "ఒరేయ్, లీలనే చేస్కోరా, మనింట్లో ఎవరికీ ఇంత పొడుగు జడ లేదు. రేపు నీ పిల్లలకి కూడా పొడుగు జుట్టు వస్తుంది." అని చెప్పిందిట. నాది మాత్రం మా అత్తయ్యల పోలికతో పొట్టి జడే, భారతీ, పద్మా మాత్రం పొడుగు జడేసుకుని పోజులు పోతూ వుండేవారు.
మొత్తానికి ఎలాగైతేనేం మా అమ్మా, నాన్నకి పెళ్ళయ్యింది. నాన్న పెళ్ళవుతూనే బామ్మా వాళ్ళంతా బెజవాడకి మకాం మార్చేసారుట. నాన్నకి బెజవాడలో వుద్యోగం. బామ్మ మాదగ్గిరే వుండేది. దాంతో మా అత్తయ్యలూ, పెద్దనాన్నలూ, బాబాయిలూ, వాళ్ళ కుటుంబాలూ, అంతా ఎప్పుడూ వస్తూ, పోతూ, ఉంటూ వుండేవారు. ఇల్లంతా ఎప్పుడూ ఫుల్లుగా సందడి. ఆడవాళ్ళకి, ముఖ్యంగా కోడలిగా మాఅమ్మకి, చేతినిండా పని. బామ్మక్కూడా పనే ఎప్పుడూ. మా అమ్మ పని పెనం లోంచి పొయ్యి లోకి, లేదా పదిమంది పిల్లలున్న ఇంట్లోంచి, పన్నెండుమంది పిల్లలున్న ఇంట్లోకి. (ఈ పన్నెండు మందినీ ముందు ముందు పరిచయం చేస్తా.) నాకు వూహ తెలిసి మా అమ్మ ఎప్పుడూ ఏదో పని చేస్తూనే వుండేది. వంట పనంతా మా బామ్మ చేసేది. ఆవిడకి అన్నీ అందించాల్సింది మాఅమ్మ. మా అమ్మావాళ్ళ కుటుంబం లాగా మానాన్నా వాళ్ళ కుటుంబం కూడా ఆస్తులు అన్నీ అమ్మేసుకుని చదువులూ, తెలివితేటలూ మాత్రమే ఆస్తులుగా మిగిలిపోయారు. మా బామ్మ గురించైతే ఓ పెద్ద ఎపిసోడ్ రాయాల్సిందే. ఈ రోజుకీ నాకు ఆవిడే రోల్ మోడల్, ఐడియల్, ఐడల్, కూడా. తల్లులు అంతా మా బామ్మ లాగా వుంటే, పిల్లల మధ్య ఆప్యాయతలు కలకాలం నిలిచి వుంటాయి. సరే, ఆవిడ గురించి మళ్ళీ రాస్తా.
ఇంటినిండా పెద్దలు, పిల్లలు, ఆడపడుచులు, తోడికోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సందడే సందడి. మా నాన్న టీచర్, అందులోనూ లెక్కలటీచర్ అవటం వల్ల, బంధువుల్లో ఎవరి పిల్లలు సరిగ్గా చదవకపోయినా, లేదా వాళ్ళు వుండే వూళ్ళో చదువుకునే సౌకర్యం లేకపోయినా, ఆ పిల్లలు వెంటనే మా ఇంటికి పార్సిల్ చేయబడేవాళ్ళు. ఇహ వాళ్ళ తిప్పలు చూడండి, అసలే మా నాన్న మహా డిసిప్లినేరియన్, ఆరెస్సెస్స్ బాక్ గ్రౌండ్, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, మా నాన్న 'ఆ' అంటే చాలు బిక్కచచ్చిపోయేవాళ్ళు. సరిగ్గా వాళ్ళు చదువుకోక పోయారో, వాళ్ళ పని అయిపోయినట్లే, నాన్న వాళ్ళు ఎవరైనా సరే, వంగదీసి వీపు మీద గుద్దేవాడు. బహుశా ఆ దెబ్బలకి భయపడి వాళ్ళు మాఇంట్లో బాగానే చదువుకునేవారు. మొత్తంమీద ఇంటినిండా చదువులకి వచ్చినవాళ్ళు, సెలవలకి వచ్చినవాళ్లు, వైద్యానికి వచ్చినవాళ్ళు, పురుళ్ళకి వచ్చినవాళ్ళు, పట్నానికి పనిమీద వచ్చినవాళ్ళతో ఇల్లంతా కోలాహలంగా వుండేది నా చిన్నప్పుడు. ఆవిధంగా మాకందరికీ ఇంటినిండా జనం అలవాటు అయిపోయారు.
ఇంతమందికి ఎంత వంట చేయాలి, ఏమేమి చేయాలి, కూరలు ఎన్ని తరగాలి, వగైరా విషయాలన్నీ బామ్మ డిసైడ్ చేస్తే, అమ్మ, మిగిలిన వాళ్ళు ఫాలో చేసేవాళ్లుట. ఇంతమంది పిల్లల మీద ఎవరి పిల్లలకి ఎవరు స్నానం చేయించేవారో, ఎవరు అన్నం పెట్టేవారో, ఎవరు జళ్ళేసేవారో, మొత్తం మీద పనులన్నీ అయిపోయేవి. అమ్మ మాకు మరీ చిన్నప్పుడు ప్రత్యేకంగా ఏమైనా చేసినట్లు గుర్తే లేదు. పండగలకి ఇంతమందికీ నూనెలు, నలుగులు, తలంట్లు, అబ్బో, అదో హడావుడి. వంటలు కూడా మొదటి వాళ్లకి దక్కినట్టు, చివరివాళ్ళకి దక్కేవి కావు. సాధారణంగా ఆ చివరిగా మిగిలేది కోడళ్ళే. పాపం, మా అమ్మా, ఆమ్మా వాళ్ళు పనంతా చేసి చివర్లో ఆ పిండివంటలు రుచి చూడటానికి కూడా మిగలకపోతే చాలా బాధపడేవారుట. తలుచుకుంటే ఇప్పుడు నాకూ జాలి వేస్తుంది. అందరూ తిన్నాక, వీళ్ళు తింటూ, అదీ సరిగ్గా అందకపోతే ఎలా? మన మధ్యతరగతి వుమ్మడి కుటుంబాలన్నీ ఇంతేనేమో. ఎవరైనా మెత్తనివాళ్ళు, మొహమాటస్థులు వుంటే అందరూ వాళ్ళ మీదకి ఎక్కేసి వాళ్ళపనులూ, వాళ్ళఖర్చులూ, వీళ్ళమీద రుద్దేసి జరిపించేసుకుంటారు. తీరాచూస్తే అందరూ మనవాళ్ళే, పరాయి వాళ్ళెవరూ వుండరు. ఎవరైతే గృహ నిర్వహణా బాధ్యత తీసుకుంటారో, వాళ్లకి బాంక్ బాలన్సులూ వుండవు, వంటి మీద నగలూ, నాణ్యాలూ వుండవు, ఆస్తిపాస్తులూ మిగలవు. మంచి పేరు మాత్రం కొండంత, తరతరాలుగా నిలిచిపోతుంది. ఇప్పటికీ బంధువులందరిలో అమ్మకీ నాన్నకీ ఎంత మంచి పేరో. ఫలానా రామకృష్ణుడు, లీలా వాళ్ళ వల్లే మేమీ రోజు ఇలా నిలబడ్డాం, అని చాలామందే చెప్పుకుంటారు. అది మాకు గర్వంగానే వుంటుంది, కానీ అమ్మా, నాన్నా కోల్పోయిన సౌకర్యాలు తలచుకుంటే మాత్రం బాధేస్తుంది. ఇద్దరూ ఇద్దరే.
భట్టిప్రోలు విజయలక్ష్మి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి