మా అమ్మవే మరి కొన్ని ముచ్చట్లు
చక్కగా సమానంగా పంచుతానని పూలమాల కూడామా అమ్మ గుర్తుల్లో చిన్నప్పుడు వడ్లుదంపించటం, కూలీలకి కూలీ ఇవ్వటం, అది వాళ్ళు చక్కగా పంచుకోవటం కూడా ఒకటి. ఈ విషయం చాలాసార్లు చెప్పేది. వడ్లపురుల్లోంచి వడ్లు తీసి ఆడ కూలీలని పిలిచి ఇంట్లోనే దంపించేవారట. రోళ్ళు, కుందులు, రోకళ్ళు తీసుకుని అందరూ ఆటలు, మాటలు, పాటలతో ఇల్లంతా హోరెత్తిస్తూ వడ్లు దంచేవారట. అమ్మా వాళ్ళంతా ఇదంతా నోరు తెరుచుకు చూస్తూ వుండేవాళ్ళట. ఆ కూలీలకు కూలీగా వడ్లు, బియ్యం, నూకలు ఇచ్చేవారట. వాళ్ళు అవన్నీ ఎంత సమానంగా పంచుకునేవారో చూస్తే ముచ్చట వేసేదిట. ఒక్క గింజ ఎక్కువా, తక్కువా కాకుండా భలే పంచుకునేవారట. ముందర మానికలతో, తరువాత చిన్న గిద్ద కొలతలతో, ఆ తరువాత అరచేతులతో, ఆ తరువాత నాలుగు వేళ్ళతో , అంటే చారెడు చారెడు అలా పంచుకునేవారట. అమ్మకి అలా సమానంగా పంచుకుంటుంటే భలే ముచ్చట వేసేదిట. అలా ఏదైనా సమానంగా పంచితే ఆవిడకి చాలా ఇష్టం. నేను కూడా ఏదైనా నాకే ఇచ్చి ముక్కలు చేసి అందరికీ ఇమ్మనేది. సమానంగా వున్న ముక్కలు చూసి మహా ముచ్చట పడేది, మెచ్చుకునేది.
భట్టిప్రోలు విజయలక్ష్మి

'నువ్వుకానీ, బాబుకానీ వుంటే నాకు ధైర్యమే, మీతో ఎక్కడికైనా రాగలను, నా చెయ్యి పట్టుకుని నడిపిస్తారు, వదలరు, నా సౌకర్యం చూస్తారు' అనేది. నాలుగో క్లాసు తర్వాత బడి ఎలా ఎగ్గొట్టాలా అని ప్లాన్లేసిన మా అమ్మ తన జీవితపు చివరి పదిహేను సంవత్సరాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, పారిస్, కెనడా దేశాలు తిరిగింది. అప్పుడు బాబు (వివేక్) అమెరికాకి, లండన్ కి, కెనడాకి, పారిస్ కి తీసుకెళ్తే, పద్మ ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళింది. అన్నట్టు, నాన్న ఉన్నప్పుడే అమ్మా, నాన్నా, భారతి కుటుంబం, మా కుటుంబం అంతా నేపాల్ వెళ్ళాం. పశుపతినాధున్ని దర్శించుకున్నాం. లుంబినీ వెళ్లాం, బుద్ధుడు పుట్టిన సరోవరం చూశాం. అమ్మ బాగా ఎంజాయ్ చేసింది, ఆవిడకి బుద్ధుడంటే చాలా ఇష్టం. హుస్సేన్ సాగర్ బుద్ధుడి దగ్గరక్కూడా తీసుకెళ్ళమంది, కానీ ఎందుకో కుదరలేదు, మేమూ దాన్ని ఈనాటికీ చూడలేదు. ఒకసారి వెళ్తే బుకింగ్ క్లోజ్ అన్నాడు. యాత్రలంటే ఆవిడకిష్టం. నాన్న ఉన్నప్పుడే ఎల్టీసీలో చాలా చూపించాడు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, మేఘాలయ, తమిళనాడు అన్నీ చూశాం.
ఇవ్వన్నీ ఒక ఎత్తు, ఆవిడ పుస్తక పఠనం ఒక యెత్తు. బోలెడు పుస్తకాలు చదివేది, (బహుశా నాకు ఈ పుస్తకాలు చదివే అలవాటు అమ్మ నుంచే వచ్చి వుంటుంది.) కావ్యాలూ, నవలలూ, కవితలూ, వీక్లీలూ, మంత్లీలూ, పురాణాలూ, ప్రవచనాలూ, ధర్మగ్రంథాలూ అన్నీ చదివేది. వాళ్ళ మోహనన్నయ్య, పార్థు ( మా మామయ్య నండూరి పార్థసారథి) రాసిన పుస్తకాలు ఇంకా శ్రద్ధగా చదివేది. రమణ బాబాయి గారి పుస్తకాలు ఓసారి శ్రీదేవి పిన్ని బోల్డు ఇచ్చింది. అవి అన్నీ చదివింది. అవ్వన్నీ మాకందరికీ కంఠస్థం అయిపోయాయి.
ఓసారి సువర్చలత్తయ్య, సీతామ్మలతో కలిసి (అప్పుడు ఓ పది పదిహేను మంది వెళ్ళారనుకుంటా) అరుణాచలం వెళ్ళింది. అరుణాచలం వెళ్ళాక చలం ఎలా రమణుడి మైకంలో పడిపోయారో, అలాగే మా అమ్మ కూడా రమణుడి ఫిలాసఫీలో, ఆయన మత్తులో మునిగిపోయింది. ఆయన పుస్తకాలు చాలా చదివింది. ఆయన వేదాంతమే మాట్లాడేది. ఏ కాస్త అవకాశమొచ్చినా ఇంట్లో చర్చలు నడిపేది, నాతోనో, మరెవరితోనో. మొత్తానికి సత్కాలక్షేపం చేసేది. చక్కగా దేవుళ్ళ పటాలు పెట్టి వాటన్నింటికీ పూలు పెట్టేది. ఆ పూలు పడిపోకుండా అగరుబత్తి చివరన వుండే పుల్లని సగానికి వంచి దాన్ని హుక్ లాగా ప్రతి పటా నికీ పైన పెట్టి దానికి పూలు పెట్టి అలంకరించేది. ఆ పూలు మర్నాడు తీసేదాకా పడిపోయేవికావు. ఇంటి నిండా దేవుడి పటాలు, కాలండర్లు నింపేసేది. ఇంకా పాత కాలండర్లు మంచి పటాలవి వుంటే తెండి అనేది. అవ్వన్నీ గమ్ టేప్ తో గోడలకి అంటించేది. నేను ఎటు చూసినా ముచ్చటైన దేవుడి పటం కనిపించాలి అనేది. ధ్యానం చేసుకునేది. తన ధ్యాన అనుభవాలని సువర్చలత్తయ్యతో, నాతొ చర్చించేది. చివరి ఏడాది రెండేళ్ళు చాలా సాధన చేసింది.

Chala bagundi. Naku mee Amma, Sridevi atthayya,Rohini Telusu migatha Vallu teliyadu Ippudu telusukuntunna.
రిప్లయితొలగించండిthanks, mundu mundu nandiwada kutumbam, bhattiprolu kutumbam kooda vastaayi.
తొలగించండి